Assembly : తెలంగాణ అసెంబ్లీ (Assembly) ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన వెంటనే వాయిదా పడ్డాయి. ఈ సమావేశాలును మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. అసెంబ్లీ నోట్స్ మరియు మినిట్స్ సిద్ధం చేయడానికి కొంత సమయం పడుతుందని వెల్లడించారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వే పూర్తయిన సంగతి తెలిసిందే. కుల గణన నివేదిక, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. అయితే స్పీకర్ సభను వాయిదా వేశారు.