మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్‌లోనే కాక బాలీవుడ్‌లోనూ మంచిపేరు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తుంటుంది ఈ భామ. తన డ్యాన్స్‌కు కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. బోల్డ్ సీన్స్‌కు దూరంగా ఉన్న తమన్నా బాలీవుడ్‌లోకి వెళ్లాక రూట్ మార్చింది. మార్పులు చేసుకుంది. లస్ట్ స్టోరీస్ 2, జీ కార్ద అనే వెబ్ సిరీస్ లలో తమన్నా బోల్డ్ గా రెచ్చిపోయింది. ఏ సీనిమాలో లేని విధంగా ఈ ముద్దుగుమ్మ ఆ మూవీస్‌లో బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి చేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ శృంగార సన్నివేశాలపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
‘రొమాంటిక్ సీన్స్‌లో నటించడం చాలా కష్టం. నేను మొదట్లో ఇలాంటి వాటిల్లో నటించకూడదు అనుకున్నాను. కానీ నా రూల్స్ బ్రేక్ చేసి నేను బోల్డ్ సీన్స్‌లో నటించాను. నటించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే చాలా మంది శృంగార సన్నివేశాల్లో నటించడానికి హీరోయిన్స్ మాత్రమే చాలా ఇబ్బంది పడతారు అని అనుకుంటారు. కానీ అది అవాస్తవం. ఒక నటి ఆ సీన్ చేయడానికి ఎంత భయపడుతుందో అంతకు రెట్టింపుగా హీరో కూడా టెన్షన్‌గా ఫీల్ అయి యాక్టింగ్ చేస్తాడు. తనతో పాటు నటిస్తున్న నటి ఇబ్బంది పడకుండా మనం జాగ్రత్తగా ఉండాలని మేల్ యాక్టర్స్ భావిస్తారు. వాళ్ళు ఏమనుకుంటారో అని తెగ టెన్షన్ పడిపోతుంటారు. కానీ అలాంటి సన్నివేశాలు చేసినప్పుడు అండర్ స్టాండిగ్‌గా చేయాలి. అప్పుడే ఆ సీన్ బాగుంటుంది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.