Homeక్రైంబీ ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్‌, రేప్ కేసులో కొత్తట్విస్ట్

బీ ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్‌, రేప్ కేసులో కొత్తట్విస్ట్

బీ ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్‌, సామూహిక లైంగికదాడికి సంబంధించిన కేసు కొత్త మలుపు తిరిగింది.

ఈ నేపథ్యంలో పోలీసులు శాస్త్రీయ ఆధారాలను పక్కాగా సేకరిస్తున్నారు. అయితే.. బాధితురాలు చెప్పే విషయాల్లో స్పష్టత లేకపోవడం, గురువారం చెప్పిన అంశాలకు, శుక్రవారం చెప్పిన విషయాల్లో తేడాలను గుర్తించారు. దీంతో అమ్మాయి తీరుపై పోలీసులు దృష్టి సారించారు.

అసలేం అమ్మాయి అబ్బాయి తో వొంటరిగా అక్కడికి ఎందుకు వెళ్ళిందో నిగ్గుతేల్చేందుకు పోలీసులు గూగుల్‌ మ్యాప్స్‌, ఘటన జరిగిన రోజు సెల్‌ఫోన్‌ టవర్‌ నుంచి వచ్చి పోయిన కాల్స్‌ డాటాను సేకరిస్తున్నారు.

ఇందులో ఆటోవాలల పాత్ర ఏమీ లేదని ప్రాథమికంగా పొలీసులు నిర్ధారించారు.

బాధితురా లు చెప్పిన ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను మ్యాపింగ్‌ చేస్తున్నారు. అయితే.. బాధితురాలు చెప్పే విషయాలు, వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉండటంతో… ఈ ఘటనపై పోలీసులు అనుమానిస్తూ అసలు ఈ ప్రాంతం లో కిడ్నాప్‌నకు అవకాశాలున్నాయా? అనే కోణాలను పరిగణలోకి తీసుకొని దర్యాప్తులో ముందుకెళ్తున్నారు.

సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. ఇప్పటికే ఆమె చెప్పిన అంశాలను, సమయాలను పరిగణలోకి తీసుకొని కొందరిని అదుపులోకి తీసుకొని విచారించారు.

దీనికితోడు ఆ ప్రాంతంలోని సెల్‌ఫోన్‌ టవర్‌ కాల్స్‌ను డంప్‌ చేసి పరిశీలించినట్లు తెలిసింది. ఆమె ఫోన్‌లో ఎవరితో మాట్లాడిందనే విషయాలపై ఆరా తీసి.. కీలకమైన ఆధారాలను సేకరించినట్లు తెలిసింది. బాధితురాలు తన స్నేహితుడితో మాట్లాడినట్లు, అతడి బైక్‌పై వెళ్లిందనే సమాచారాన్ని పోలీసులు సేకరించారు.

అయితే స్నేహితుడితో వెళ్లిన తరవాత నిర్మానుష్య ప్రదేశంలో మరికొందరు కూడా అక్కడకు వచ్చినట్లు.. అందరూ కలిసి గంజాయి తాగినట్లు ఆపై ఎం జరిగిందో తెలుసుకునే పనిలో పోలీసుల ఉన్నారు. అక్కడ గంజాయి అనవాళ్లు కూడా సేకరించినట్లు సమాచారం.

సరిగ్గా అదే సమయంలో ఇంటికి ఇంకా రాలేదని తల్లి అడగడంతో, తనను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారంటూ బాధితురాలు తల్లికి చెప్పడం, డయల్‌ 100కు ఫోన్‌ చేయడం, పోలీసులు అలర్ట్‌ అయి రంగంలోకి దిగడంతో కథ అడ్డం తిరిగింది. కానీ బాధితురాలి పై అత్యాచారం జరిగిందని వైద్యులు నివేదిక ఇవ్వడంతో కేసులో మరో ట్విస్ట్ పడ్డది.

బాధితురాలు కోలుకున్న తరువాత అసలు ఏం జరిగిందనే అంశాలపై స్పష్టత తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది.

కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని, దర్యాప్తులో పూర్తి స్పష్టత రాలేదని.. ఘటన జరిగిన స్థలం దాకా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తున్నామని.. ఈ కేసులో పూర్తి స్పష్టతతో మీడియా ముందుకు వస్తామని పొలీసులు స్పష్టం చేశారు.

 

Recent

- Advertisment -spot_img