Bank holiday : దేశవ్యాప్తంగా రేపు అన్ని బ్యాంకులకు సెలవు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న జాతీయ సెలవు దినంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సోమవారం దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు ప్రకటించింది. అయితే అన్ని బ్యాంకులు మూసివేయబడినప్పటికీ, అన్ని ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి కస్టమర్లు ఈ సెలవును దృష్టిలో ఉంచుకుని, వారి అవసరాలకు అనుగుణంగా వారి బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం మంచిది.