– మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం
– ఎప్పటినుంచో డిమాండ్
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కెబినెట్ సమావేశం కాబోతున్నది. ఈ మీటింగ్ అనంతరం భారత రత్న అవార్డుపై ప్రకటన చేయబోతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని చాలా రోజులుగా డిమాండ్ ఉంది. అయితే గతంలో కేంద్ర ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోలేదు. చంద్రబాబు సపోర్ట్‌తో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సైతం.. చంద్రబాబు భారతరత్నపై పూర్తిస్థాయిలో ఒత్తిడి చేయాలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వడం ద్వారా రాజకీయలబ్ధి పొందొచ్చని మూడు పార్టీలు భావిస్తున్నాయి.