HomeరాజకీయాలుBJP: BJP is the second list with only one name BJP...

BJP: BJP is the second list with only one name BJP : ఒకే ఒక్కపేరుతో బీజేపీ సెకండ్​ లిస్ట్​

– మిథున్ రెడ్డికి మహబూబ్​నగర్​ టికెట్​
– జితేందర్​ రెడ్డి పార్టీ మారతారన్న అనుమానంతో కుమారుడికి టికెట్​?

ఇదేనిజం, హైదరాబాద్​: ఒకే ఒక్క అభ్యర్థి పేరుతో బీజేపీ రెండో జాబితా విడుదలైంది. మహబూబ్​నగర్​ అసెంబ్లీ స్థానం నుంచి జితేందర్​ రెడ్డి కుమారుడు మిథున్​ రెడ్డికి టికెట్​ కేటాయించారు. ఈ మేరకు శుక్రవారం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్‌ కమిటీ ప్రకటనను విడుదల చేసింది. ఒకే ఒక్క పేరుతో బీజేపీ సెకండ్​ లిస్ట్​ విడుదల కావడం గమనార్హం. జితేందర్​ రెడ్డి పార్టీ మారబోతున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం సాగిన విషయం తెలిసిందే. జితేందర్ రెడ్డి కొన్ని రోజుల క్రితం కీలక నేతలతో కలిసి వరస భేటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. మరోవైపు ఆయన కాంగ్రెస్​ పార్టీలో చేరబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. దీంతో బీజేపీ హైకమాండ్ ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చినట్టు సమాచారం.

Recent

- Advertisment -spot_img