Home Blog Page 10

టికెట్ బుకింగ్ పై రైల్వే శాఖ నిర్ణయం.. ఇకపై IRCTCలో అలా చేయలేరు..!

0

రైల్వే టికెట్ బుకింగ్ నియమాలను మార్చుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రయాణ రోజు నుంచి 120 రోజుల ముందే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సదుపాయం ఉంది. కానీ, నవంబర్ 1 నుంచి దీనిని కుదిస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఇకపై IRCTCలో 60 రోజుల ముందు మాత్రమే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండనుంది. ఇప్పటికే బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఎలాంటి సమస్య ఉండదు.

ఒకేరోజు ఆ స్టార్ హీరోలతో మూవీ షూటింగ్.. ఆనందంగా ఉందంటున్న నిధి అగర్వాల్

0

నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహరవీరమల్లు’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ సినిమాలో కూడా నిధి అగర్వాల్ నటిస్తుంది. ఈ రెండింటిలో నటించడం గురించి నిధి అగర్వాల్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హరిహరవీరమల్లు’, ‘రాజా సాబ్’ అనే రెండు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఒకేరోజు ఈ రెండు ల షూటింగ్స్ లో పాల్గొనడం మరింత ఆనందంగా ఉంది. అది కూడా ఒక షూటింగ్‌ ఆంధ్రాలో, మరొకటి తెలంగాణలో జరుగుతుంది.ఈ రెండూ సినిమాలు తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని నిధి అగర్వాల్ పేర్కొంది.

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ అప్పుడే..!

0

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని గతంలోనే కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే కొత్త రేషన్ కార్డుల అర్హతపై ఇక సస్పెన్స్ కొనసాగుతోంది. కార్డుల జారీకి లబ్ధిదారుల ఆదాయ పరిమితి, అర్హతలపై నిబంధనలను పున:సమీక్షిస్తామని చెప్పడంతో ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షల్లోపు, పట్టణాల్లో రూ.2లక్షల్లోపు ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అలాగే 3.5 ఎకరాలలోపు తడి, 7.5 ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్నవారికి మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిపారు. దసరా అయిపోవడంతో కొత్త రేషన్ కార్డుల పై కీలక అప్డేట్ ఉంటుందని అందరు ఎదురు చూస్తున్నారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక అధికారిక ప్రకటన రావచ్చని తెలుస్తుంది.

కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి.. ఇంటర్ విద్యార్థినిపై ముగ్గురు అత్యాచారం

0

తమిళనాడు సేలం జిల్లాకు చెందిన 16 ఏళ్ల బాలికకు కూల్ డ్రింకులో మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని, ఆందోళనకు గురి చేసింది.అయితే వివరాల్లోకి వెళితే… సేలం జిల్లా కిచిపాళయం ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక స్థానిక పాఠశాలలో పన్నెండో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో విద్యార్థికి అదే ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువకుడితో స్నేహం ఏర్పడింది. ఈ సందర్భంలో, మనం కొల్లిమలై వెళదాం అని చెప్పాడు. అయితే ఈ విషయం ఇంట్లో చెప్పకూడదు అని ఆమెకు చెప్పాడు.. ఈ క్రమంలో విద్యార్థిని ఇంట్లో తెలియకుండా చూసుకుంటానని చెప్పిన యువకుడు ఎనిమిదో తేదీన విద్యార్థినిని తీసుకుని తన ఇద్దరు స్నేహితులతో కలిసి కొల్లిమలై వెళ్లాడు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చని, ఓ ప్రైవేట్ లాడ్జిలో ఉంటున్నామని చెప్పారు. విద్యార్థినికి తెలియకుండా ముగ్గురు యువకులు శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత విద్యార్థి తల్లిదండ్రులకు విద్యార్థినిపై అనుమానం రావడంతో ఆరా తీశారు. తన స్నేహితురాలు శీతల పానీయంలో మత్తుమందు కలిపి తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడని విద్యార్థిని ఫిర్యాదు చేసింది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి ముగ్గురు యువకులను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి బిగ్ షాక్.. షేక్ హసీనాపై అరెస్టు వారెంట్‌..!

0

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై అరెస్టు వారెంట్ జారీ అయింది. ఆ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ ఈ వారెంట్ ఇచ్చింది. నవంబరు 18లోగా ఆమెను అరెస్టు చేసి తమ ఎదుట హాజరు పరచాలని ఐసీటీ చీఫ్‌ ప్రాసిక్యూటర్ మహమ్మద్‌ తజుల్‌ ఇస్లాం తన ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.

ఎట్టకేలకు.. ఏపీలో రిపోర్టు చేసిన ఆ నలుగురు ఐఏఎస్ అధికారులు

0

డీఓపీటీ ఆదేశాల మేరకు ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులు రిపోర్టు చేశారు. ఆమ్రపాలి, రోనాల్డ్ రోజ్, వాకాటి కరుణ మరియు వాణీప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ నిరబ్ కుమార్ ప్రసాద్‌కు నివేదించారు. కాగా, తెలంగాణ నుంచి నిన్న(బుధవారం) సాయంత్రం నలుగురు ఐఏఎస్ అధికారులు రిలీవ్ అయ్యారు. డీవోపీటీ ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో ఈ నలుగురు అధికారులు ఏపీకి వచ్చారు.

6Gలో భారత్‌ అగ్రగామిగా నిలిచేలా అడుగులు.. టెస్టింగ్ దశలో ఉన్న ఓ ఫొటో వైరల్..!

0

టెలికమ్యూనికేషన్ ల్యాండ్‌స్కేప్‌లో విప్లవాత్మక మార్పులు చేసే దిశగా
IIT మద్రాస్‌ అడుగులు వేస్తోంది. 6G ట్రయల్స్ కోసం టెస్ట్ బెడ్ యూనిట్‌ను ప్రారంభించింది. ఇందులో 6397MBPS ఇంటర్నెట్ స్పీడ్‌తో టెస్టింగ్ దశలో ఉన్న ఓ ఫొటో వైరలవుతోంది. 2030 నాటికి 6G టెక్నాలజీలో భారతదేశాన్ని అగ్రగామిగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. భారత్ 6G విజన్‌ స్తోమత, సుస్థిరత, సర్వవ్యాప్తి అనే మూడు సూత్రాలతో పనిచేస్తోంది.

ఏపీ సీఎం చంద్రబాబుకు షాక్.. వైసీపీ పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి

0

ఏపీ రాష్ట్ర సీఎం చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది. టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీ కృష్ణంరాజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఈరోజు మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు ఈరోజు జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ సీఎం జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని ముదునూరి మురళీకృష్ణం రాజు వెల్లడించారు. అయితే అందరూ అధికార పార్టీ వైపు చూస్తుంటే అధికార పార్టీ అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. కాగా, ప్రత్తిపాడులో స్థానిక పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల నేపథ్యంలో ముదునూరి మురళీకృష్ణంరాజు టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా కుదేలైంది.. సీఎం రేవంత్ పై ఈటల ఫైర్..!

0

సీఎం రేవంత్ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఆదాయం రోజురోజుకి తగ్గుతుందని BJP MP ఈటల రాజేందర్ విమర్శించారు. హైదారాబాద్ లో ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలు సన్నగిల్లి పోతున్నాయని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా కుదేలైందని.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆగ్రహించారు. 6 గ్యారెంటీలలో ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం తప్పితే మిగతా గ్యారెంటీలు పూర్తికాలేదన్నారు. రైతు బంధు ఊసే లేదు, కౌలు రైతుల ఊసే లేదన్నారు.

మీకు మేము అండగా ఉంటాం.. గ్రూప్ 1 అభ్యర్థులకు కేటీఆర్ హామీ

0

తెలంగాణ భవన్ లో గ్రూప్ 1 అభ్యర్థులతో కేటీఆర్ సమావేశం ముగిసింది. గ్రూప్ 1 అభ్యర్థులు కేటీఆర్‌ను కలవాలని కోరడంతో తెలంగాణ భవన్ లో ఈరోజు ఆయనను కలిశారు.జీవో నంబర్ 29ని తొలగించాలని కొందరు అభ్యర్థులు కేటీఆర్‌ను కోరగా.. ఈ జీవో వల్ల నష్టపోతామని అభ్యర్థులు తెలిపారు. గ్రూప్ 1 మెయిన్స్‌ను వాయిదా వేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అభ్యర్థులు కేటీఆర్‌కు సూచించారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. తప్పకుండా సహకరిస్తానని చెప్పారు. సుప్రీం కోర్టుకు వెళితే పార్టీకి అండగా నిలుస్తామని అభ్యర్థులు హామీ ఇచ్చారు.గ్రూప్-1 మెయిన్స్‌ను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 21 నుంచి జరగాల్సిన గ్రూప్-1 మెయిన్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం వందలాది మంది అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.