Home Blog Page 1222

ఈ ఆరు చిట్కాలతో సీజనల్​ వ్యాధులకు చెక్​

0

రుతుపవనాల రాకతో వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు తరుచుగా చిన్న పెద్ద అందరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి..
ఆరోగ్యం ఇబ్బంది పెట్టిన తర్వాత డాక్టర్ ని సంప్రదించడం కంటే ముందుగా ఈ 6 చిట్కాలు పాటిస్తే మనం ఆరోగ్యం గా ఉండొచ్చు…


పసుపు ::

గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు వేస్కుని తాగితే ఇమ్మ్యూనిటి పవర్ పెరిగి జలుబు, గొంతునొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది, ముఖ్యం గా ఈ కరోనా టైం లో వేడినీళ్లలో పసుపు వేసి ఆవిరి పట్టడం ద్వారా, ముక్కు రంద్రాలలో, గొంతులో ఉన్న క్రిములు నశించి, ఇమ్మ్యూనిటి పవర్ పెరుగుతుంది.


అల్లం ::


అల్లం లోని అనేక ఔషధ గుణాలు ఇమ్మ్యూనిటి ఇస్తాయి, అల్లం ని తరుచుగా టీ, వేడి నీళ్లు ద్వారా తీసుకోవడం వల్లన ముఖ్యం గా కఫం, ఉబ్బసం లాంటి ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

దాల్చిక చెక్క ::


దాల్చిన చెక్క ముఖ్యంగా బొంగురు గొంతు, వైరల్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది, ప్రతి రోజు కూరల్లోనే కాకుండా, దాల్చిన చెక్క ని కాల్చి పొడిలా చేసి పెప్పర్ ల తరుచుగా ఉపయోగిస్తే ఆరోగ్యానికి దాల్చిన చెక్క చాలా మేలును చేస్తుంది.

మెంతులు ::


మెంతుల తరుచుగా తీసుకోవడం వల్లన ఇమ్మ్యూనిటి ని పెంచి తిరుగుచు శరీర భాగాల్లో లో చేరే అనవసరపు నీటిని అదుపులో ఉంచుతుంది, మెంతులు చలవ చేస్తాయి, అనవసరపు వేడిని తగ్గిస్తాయి, పెరుగు తో కలిపి మెంతులను తీసుకోవడం వల్లన శరీరం లో పెరిగే కొవ్వు ని అదుపులో ఉంచుతాయి.
జుట్టు కి పెరుగు మెంతుల ను నానబెట్టి ఆ మిశ్రమాన్ని తలకిపట్టించడం ద్వారా జుట్టు కి కావాల్సిన పోషణ అందుతుంది.

హెర్బల్ టీ ::


హెర్బల్ టీ (కాషాయం ), గ్రీన్ టీ ని ఉదయం తీసుకోవడం ద్వారా ఇమ్మ్యూనిటి పవర్ పెరిగి, శరీరం లో పెరిగే అధిక కొవ్వు ని అదుపులో ఉంచుతుంది.

వేడి వేడిగా ::

ఈ వర్ష కాలం లో తరుచుగా వేడినీటిని సేవిస్తూ ఉండాలి.
ఆహారం వేడిగా భుజించాలి.
ముఖ్యంగా ఈ కరోనా టైం లో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

#India Vs #England : ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 396/9 డిక్లేర్డ్..

0

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. చివర్లో అన్యా వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడేసింది. కేవలం 33 బంతుల్లోనే అన్యా ఆరు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టేయడంతో…

భారత మహిళల జట్టుతో బ్రిస్టోల్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లాండ్ మహిళల జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది.

మ్యాచ్‌లో రెండో రోజైన గురువారం ఓవర్‌నైట్ స్కోరు 269/6తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఇంగ్లాండ్ టీమ్‌లో సోఫియా (74 నాటౌట్: 127 బంతుల్లో 9×4) హాఫ్ సెంచరీ నమోదు చేసింది.

ఆమెతో పాటు చివర్లో అన్యా (47: 33 బంతుల్లో 6×4, 1×6) దూకుడుగా ఆడేసింది.

దాంతో.. 121.2 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్.. 396/6 వద్ద తొలి ఇన్నింగ్స్‌‌ని రెండో సెషన్‌లో డిక్లేర్ చేసింది.

ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరు 12తో ఈరోజు ఇన్నింగ్స్‌ని కొనసాగించిన సోఫాలి చివరి వరకూ అజేయంగా క్రీజులో నిలిచింది.

అయితే.. మరో ఎండ్‌లోని కేథరైన్ బ్రౌంట్ (8: 37 బంతుల్లో) నిన్నటి స్కోరుకి ఒక పరుగు మాత్రమే జోడించి జులన్ గోస్వామి ఓవర్‌లో ఔటైపోయింది.

అనంతరం వచ్చిన ఎక్లీ‌టోన్ (17: 56 బంతుల్లో 1×4) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి టీమ్ స్కోరు 326 వద్ద ఔటైంది.

అయితే.. చివర్లో వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడేసిన అన్యా ఎడాపెడా బౌండరీలు బాదేయగా.. సోఫియా చక్కటి సహకారం అందించింది.

అయితే.. టీమ్ స్కోరు 396 వద్ద అన్యా ఔటవగానే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ని కెప్టెన్ హీథర్ నైట్ డిక్లేర్ చేసింది.

భారత బౌలర్లలో స్నేహా రాణా 4 వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ మూడు, జులన్ గోస్వామి, పూజా చెరో వికెట్ తీశారు.

ఫాస్ట్ బౌలర్ శిఖ ఫాండే 15 ఓవర్లు వేసినప్పటికీ.. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది.

టీమ్‌లో అత్యధిక ఎకానమీ(4.10)తో బౌలింగ్ చేసిన బౌలర్ కూడా శిఖ పాండేని కావడం గమనార్హం.

#Crime : 8 నెలలు బంధీగా మహిళ.. విషయం తెలిసి గ్రామస్థులు షాక్

0

వరకట్నం చట్టరీత్యా నేరమైనా తమ కుమార్తెలు అత్తింటిలో సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తమ తాహతకు మించి పెళ్లి సమయంలో ముట్టజెబుతున్నా కొందరికి దాహం తీరడం లేదు.

అదనపు కట్నం కోసం కోడల్ని అత్తింటివాళ్లు వేధించి.. ఆమెను ఎనిమిది నెలలు ఇంట్లో బంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

సమాజం సిగ్గుతో తలదించుకునే ఈ ఉదంతం బీహార్‌లోని సుపౌల్‌లో జిల్లాలో చోటుచేసుకుంది.

కిసాన్‌పూర్‌లో ఒక వివాహితను అత్తింటివాళ్లు బంధించిన విషయం తెలిసిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగుచూసింది.

మహిళా పోలీసు స్టేషన్‌కు సమాచారం అందజేయడంతో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్ర‌మీలా కుమారి సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ఆమెకు విముక్తి కలిగించారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. కిసాన్‌పూర్‌కు చెందిన‌ విక్రమ్ చౌదరి కుమారుడు సంజయ్ చౌదరికి ఢిల్లీలోని నోయిడాకు చెందిన మోనా అనే యువ‌తితో మూడేళ్ల కిందట వివాహం జరిగింది.

మార్చి 7, 2018న పెళ్లి స‌మ‌యంలో కట్నంగా రూ. 17 లక్షలు, కారుతో పాటు లాంఛనాలను సంజయ్‌కు మోనా తండ్రి ముట్టజెప్పారు.

పెళ్లి తర్వాత దంప‌తులు కిసాన్‌పూర్‌లో కాపురం పెట్టారు. వీరికి ఓ పాప ఉండగా.. ఆమెకు ప్రస్తుతం ఏడాదిన్నర వ‌య‌సు.

అయితే కొంత‌కాలంగా అత్తింటివాళ్లు ఆమెను వేధింపులకు గురిచేస్తున్నారు.

పుట్టింటి నుంచి మరో రూ.10 లక్షల కట్నం తీసుకురావాల‌ని చిత్రహింసలకు గురిచేశారు.

వారు కోరినంత మొత్తాన్ని బాధితురాలు తీసుకురాక‌పోవ‌డంతో భ‌ర్త‌, అత్తామామ‌లు క‌లిసి ఓ గదిలో బంధించారు.

ఆమె ఎనిమిది నెల‌లుగా ఆ గ‌దిలోనే బంధీగా ఉన్న విషయం గ్రామస్థులకు ఆల‌స్యంగా తెలిసింది.

ఈ విషయ గురించి మహిళా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందజేశారు.

గ్రామ‌స్థులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీస్ అధికారి.. గది తాళాలను పగులగొట్టి బాధితురాలిని బయటకు తీసుకొచ్చారు.

ఆమె వాంగ్మూలం నమోదు చేసి.. దీని ఆధారంగా అత్తామామలు, భర్తపై వరకట్న వేధింపుల కేసును న‌మోదు చేశారు.

ద‌ర్యాప్తులో వాస్తవాలు వెల్లడవుతాయని, నివేదిక ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి ప్రమీల కుమారి తెలిపారు.

బాధితురాలిని గదిలో బంధించిన విషయం తెలిసి పోలీసులతో పాటు వందల మంది గ్రామస్థులు అక్కడకు చేరుకుని గుమిగూడారు.

బాధితురాలి తండ్రి గౌరీ శంకర్ చౌధురి మాట్లాడతూ.. నా కుమార్తె ఎలా ఉందో చూసిరావాలని నా కొడుకును పంపాను.. ఆమెను కలిసేందుకు అత్తింటివాళ్లు అనుమతించలేదు.

ఈ విషయం గురించి గ్రామస్థులకు చెప్పడంతో వారు పోలీసులను తీసుకొచ్చిన తాళాలు బద్దలుకొట్టారని తెలిపారు.

మోనా బీటెక్ పూర్తిచేసింది. అత్తమామలు సంజయ్ చౌధురి, అభా దేవి, ఆడపడుచులు రాఖీ కుమారి, చాంద్నీ కుమార్‌లు, భర్త సంజయ్‌ను కూడా నిందితులుగా పేర్కొన్నారు.

#Twitter #privacy #HyderabadPolice : ట్విటర్‌కు షాక్‌.. హైదరాబాద్‌లో రెండో కేస్‌

0

Cyberabad Police: నోటీసుతోపాటు ట్విటర్‌ మరో ఇద్దరి వివరాలు కావాలంటూ కోరారు.

పోలీసులను కించపరిచేలా ఓ వీడియోను పోస్ట్ చేసిన ఇద్దరూ యువకుల వివరాలను కూడా తమకు అందించాలని పోలీసులు ట్విటర్‌కు రాసిన లేఖలో కోరారు.

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌పై దేశంలోనే రెండో కేసు హైదరాబాద్‌లో నమోదైంది.

ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నందుకుగాను ఈ కేసును నమోదు చేశారు.

అంతేకాక, కేసు పెట్టి.. ట్విటర్ ఇండియా యాజమాన్యానికి పోలీసులు నోటీసులు సైతం జారీ చేశారు.

ఫేక్ వీడియోపై వస్తున్న అనుచిత కామెంట్లకు ట్విటర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు.

నటి మీరా చోప్రా చేసిన ఫిర్యాదుపై ట్విటర్ వెంటనే స్పందించాలని నోటీసులో కోరారు.

నోటీసుతోపాటు ట్విటర్‌ మరో ఇద్దరి వివరాలు కావాలంటూ కోరారు.

పోలీసులను కించపరిచేలా ఓ వీడియోను పోస్ట్ చేసిన ఇద్దరూ యువకుల వివరాలను కూడా తమకు అందించాలని పోలీసులు ట్విటర్‌కు రాసిన లేఖలో కోరారు.

అయితే, కేంద్ర ప్రభుత్వానికి, ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌కు మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

కొత్త ఐటీ నిబంధనలను అమలు చేయనందుకుగాను ట్విటర్‌కు ఇప్పటివరకూ లభిస్తున్న జవాబుదారీతనం నుంచి మినహాయింపును కోల్పోయింది.

సామాజిక మాధ్యమాల్లో డిజిట‌ల్ కంటెంట్‌పై నియంత్రణ‌కు గానూ కేంద్రం తీసుకువ‌చ్చిన నూత‌న ఐటీ నిబంధ‌న‌లు మే 25 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి.

దీని ప్రకారం.. ఇక నుంచి యూజర్ల అభ్యంతరకరమైన పోస్టులపై ట్విటర్ కూడా క్రిమినల్ కేసులు, ఇతరత్రా చర్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.

Arthi Venkatesh HQ Photo gallery

0

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

Arthi Venkatesh HQ Photo gallery

#Rashmika #Pushpa : ఆడియన్స్ కి నా పాత్ర వెంటనే కనెక్ట్ అవుతుంది

0

టాలీవుడ్ లో టాప్ త్రీ హీరోయిన్లలో రష్మిక పేరు కనిపిస్తుంది. అందం .. అభినయంతో పాటు అదృష్టం కూడా రష్మికకు పుష్కలంగా ఉంది.

అందువల్లనే ఆమె సినిమాలు వరుసగా భారీ విజయాలను అందుకుంటూ వస్తున్నాయి.

తెలుగులో ఆమె తాజా చిత్రంగా ‘పుష్ప’ సినిమా రూపొందుతోంది. రెండు భాగాలుగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

మొదటి  భాగానికి సంబంధించి ఇప్పటికే 80 శాతం చిత్రీకరణను జరుపుకుంది.

తాజాగా ఈ సినిమా గురించి రష్మిక మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నా పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

ఇంతవరకూ నేను చేయని పాత్ర ఇది. ఆడియన్స్ కి నా పాత్ర వెంటనే కనెక్ట్ అవుతుంది.

ఈ సినిమా రెండు భాగాలలోను నేను కనిపిస్తాను.

నాకు ఇష్టమైన పాత్రలో .. రెండు భాగాలలోను నేను కనిపించనుండటం నాకు మరింత సంతోషాన్ని కలిగించే విషయం.

ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది” అని చెప్పుకొచ్చింది.

#Rome #Nero #Italy : నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేలు వాయించారా

0

“రోమ్ తగలబడుతున్నప్పుడు నీరో చక్రవర్తి హాయిగా, ప్రశాంతంగా ఫిడేలు వాయించుకుంటున్నారు”

రోమన్ చక్రవర్తి నీరో గురించి చెప్పుకుంటే చాలా మందికి ఈ మాట గుర్తొస్తుంది. రోమ్ నగరానికి నిప్పు పెట్టించారనే ఆరోపణలు కూడా నీరో మీద ఉన్నాయి. ఆయన కావాలనే అలా చేశారని చెబుతారు.

తన తల్లిని, సవతి సోదరులను, భార్యలను హత్య చేయించి, తన దర్బారులో ఉన్న నపుంసకులను పెళ్లాడిన ఒక క్రూర నియంతగా నీరోను వర్ణిస్తారు.

క్రీ.శ 54లో తన తల్లి ప్రయత్నాలతో నీరో 16 ఏళ్లకే విశాల రోమ్ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యారు.

అప్పుడు రోమ్ సామ్రాజ్యం స్పెయిన్ నుంచి ఉత్తరాన బ్రిటన్, తూర్పున సిరియా వరకు వ్యాపించి ఉండేది.

సింహాసనం మీద ఆశతో నీరో తల్లి అగ్రిపీనా.. రాజమహల్లో కుట్రలు చేసి, అందరి మధ్యా చిచ్చుపెట్టి కుమారుడికి అది దక్కేలా చేశారు.

అగ్రిపీనా తనకు మామయ్య అయిన చక్రవర్తి క్లాడియస్‌ను పెళ్లాడారు. ఆ తర్వాత చక్రవర్తి కూతురితో నీరో పెళ్లి జరిపించారు.

దాంతో రాజ పరివారంలో నీరో సభ్యుడయ్యారు. రాజుకు అప్పటికే ఒక కొడుకున్నప్పటికీ, సింహాసనానికి వారసుడు అయ్యారు.

అగ్రిపీనా విషపూరితమైన పుట్టగొడుగులు తినిపించి చక్రవర్తి క్లాడియస్‌ను చంపేశారని చెబుతారు. కానీ అందులో నిజమెంత అనేది ధ్రువీకరించలేకపోయారు.

తల్లినే చంపించిన నీరో

నీరో అధికారంలోకి వచ్చినపుడు, తల్లి అగ్రిపీనా ఆయనకు ఆంతరంగిక సలహాదారుగా ఉన్నారు.

పాలనలో ఎంత ఆధిపత్యం చూపించేవారంటే, రోమన్ నాణేల మీద నీరో చిత్రంతోపాటూ ఆమె బొమ్మ కూడా ఉండేది.

కానీ అధికారంలోకి వచ్చిన దాదాపు ఐదేళ్ల తర్వాత నీరో తన తల్లిని హత్య చేయించారు. ఆయన బహుశా ఎక్కువ స్వేచ్ఛ, శక్తిని కోరుకున్నారు.

నీరో తన తల్లిని ఎందుకు హత్య చేయించారు?

ప్రాచీన రోమ్ గురించి పరిశోధన చేసిన నిపుణులు, ప్రొఫెసర్ మారియా వాయెక్ నీరో గురించి రేడియోలో ప్రసారమైన ఒక కార్యక్రమంలో మాట్లాడారు.

“నీరో తల్లి ప్రవర్తన చాలా ఆధిపత్యంతో ఉండేది. కొన్నిఆధారాలను బట్టి, ఆమె కొడుకును తన అదుపులో ఉంచుకోవాలని ప్రయత్నించేవారని తెలుస్తోంది.

అది ఏ స్థాయికి చేరిందంటే, ఆమె చివరికి కొడుకుతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి కూడా వెనకాడలేదు” అని చెప్పారు.

“అయితే నీరోకు తన తల్లితో లైంగిక సంబంధం ఉన్నట్లు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు.

కానీ లభించిన ఆధారాల ప్రకారం నీరో పంపించిన హంతకులు అగ్రిపీనా దగ్గరకు వచ్చినపుడు, ఆమె వారికి తన కడుపును చూపిస్తూ నన్ను ఇక్కడ పొడిచి చంపండి. నీరో పాపం ఇక్కడే పెరుగుతోంది అన్నారట”

నీరో చిన్నతనం నుంచే అధికార సంఘర్షణను చూశారని, ఆయన వ్యక్తిత్వం, ఆలోచనలపై ఆ ప్రభావం చాలా తీవ్రంగా పడిందని మారియా చెప్పారు.

అధికారం కోసం పెళ్లిళ్లు, హత్యలు

నీరో పాలన గురించి మారియా వాయెక్ మాట్లాడారు.

“మనం రోమన్ సామ్రాజ్యం యూరప్‌లో బ్రిటన్ నుంచి ఆసియాలో సిరియా వరకు వ్యాపించిన మొదటి శతాబ్దం గురించి మాట్లాడుకుంటున్నాం.

కానీ, ఆ విశాల సామ్రాజ్యం అస్థిరంగా ఉండేది. ఒక స్వతంత్ర దేశాధినేత, సెనేట్ సాయంతో దానిని నడిపేవారు.

రోమన్ సామ్రాజ్యం మొదటి చక్రవర్తి అగస్టస్ ప్రారంభించిన వ్యవస్థలో రాజ్యాధికారం జూలియస్ క్లాడియస్ సీజర్ కుటుంబంలోనే తరతరాలవారికి దక్కాలని కోరుకున్నారు”

“ఫలితంగా అధికారం చేజిక్కించుకోడానికి కుటుంబంలో సంఘర్షణ మొదలైంది.

అధికారం కోసం కుటుంబంలో పెళ్లిళ్లు, పిల్లలను దత్తత తీసుకోవడం, విడాకులు, రాజ్య బహిష్కరణతోపాటూ ప్రత్యర్థులను అంతం చేయడం లాంటి అన్ని వ్యూహాలూ ఉపయోగించారు” అంటారు ప్రాచీన రోమ్ గురించి పరిశోధన చేసిన నిపుణులు, ప్రొఫెసర్ మారియా వాయెక్.

రోమన్ సామ్రాజ్యంలో రెండో చక్రవర్తి టిబెరియస్ పాలనాకాలంలో నీరో నానమ్మను జైలులో బంధించారు.

మూడో రాజు పాలనాకాలంలో నీరో తల్లిని దేశ బహిష్కరణ చేశారు. ఆమె క్లాడియస్ పాలనాకాలంలో తిరిగి రాజ్యంలోకి రాగలిగారు.

చివరకు తనకు మామయ్య అయిన చక్రవర్తిని పెళ్లి కూడా చేసుకుని రాజ పరివారంలో చోటు సంపాదించారు.

రేడియో కార్యక్రమంలో పాల్గొన్న బ్రిటన్ సౌత్ హాంప్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుష్మా మలిక్ కూడా నీరో వ్యక్తిత్వం, చరిత్ర గురించి వివరించారు.

“రోమన్ సామ్రాజ్యానికి నాలుగో చక్రవర్తి అయిన క్లాడియస్ క్రీ.శ 41 నుంచి 54 వరకు పాలించారు.

తన పాలనాకాలం చివరి రోజుల్లో క్లాడియస్ తన భార్యలపై ఎక్కువగా ఆధారపడ్డారు. వారిలో నీరో తల్లి అగ్రిపీనా కూడా ఒకరు” అని చెప్పారు.

ఆయన భార్యల్లో ముస్లీనా అనే మహిళ గురించి చరిత్ర పుస్తకాల్లో ఉంది. ఆమె క్లాడియస్ చుట్టూ తన అనుచరులను ఉంచేవారు.

ముస్లీనా సెనేటర్లతో శారీరక సంబంధాలు కూడా పెట్టుకునేవారని చెబుతారు.

ఆమె తన శారీరక కోరికలు తీర్చుకోవడానికి తన పదవిని కూడా పట్టించుకోలేదని అంటారు.

క్లాడియస్‌ ఆమెకు చాలా ప్రభావితమయ్యారని చరిత్ర ద్వారా తెలుస్తోంది” అని సుష్మా తెలిపారు.

క్లాడియస్ పాలనాకాలంతో పోలిస్తే, నీరో పాలన తొలి రోజుల్లో ఆయన చుట్టూ కొంతమంది మంచివాళ్లుండేవారు.

వారిలో నీరో ప్రసంగాలు రాసే తత్వవేత్త సెనెకా, అఫ్రెక్స్ బ్రూస్ అనే ఒక అధికారి ఉండేవారు.

భార్యలను చంపించిన నీరో

నీరో తన మొదటి భార్య ఆక్టేవియాతో విసిగిపోయి, ఆమెను రాజ్య బహిష్కరణ చేశారు. తర్వాత ఆమెను చంపాలని ఆదేశించారు.

ఆ తర్వాత నీరో పోపియాతో ప్రేమలో పడ్డారు. ఆమెను పెళ్లాడారు. ఆయన ఒక రోజు కోపంతో గర్భంతో ఉన్న పోపియాను కూడా చంపేశారు.

నీరో పాలనలో మొదటి ఐదేళ్లనూ రోమ్ ప్రజలకు స్వర్ణయుగంగా భావిస్తారు. ప్రాచీన రోమ్‌లో సెనేట్, పాలనాపరమైన సలహాలు ఇచ్చే ఒక సంస్థ ఉండేది.

రోమన్ సెనేట్‌కు నీరో సర్వాధికారాలు ఇచ్చారు. తనతో ఉండే రోమన్ సైన్యానికి ఎలాంటి అసంతృప్తి లేకుండా చూసుకున్నారు.

క్రీడాపోటీలు, వేడుకలు నిర్వహిస్తూ జనాదరణ పొందారు.

కానీ, నీరో మిగతా పాలనాకాలంలో జరిగిన దారుణమైన హింస, క్రూరత్వం చాటున ఆ మొదటి విజయాలు మరుగునపడిపోయాయి.

నీరో తన పాత్ర వల్ల చరిత్రలో చెడుకు, క్రూరత్వానికి ఒక ప్రతీకగా నిలిచిపోయారు.

క్లాడియస్ సమయంలో సెనేట్‌ను నిర్లక్ష్యం చేసినట్టు తన కాలంలో జరగదని నీరో మొదట్లో సెనేట్‌కు భరోసా ఇచ్చారు.

రాచరిక వ్యవహారాల్లో సెనేట్ ప్రాధాన్యం పునరుద్ధరిస్తానని వారికి చెప్పారని బ్రిటన్ సౌత్ హాంప్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుష్మా మలిక్ తెలిపారు.

అంతకుముందు సెనేట్ సభ్యులు ఒకరికొకరు వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారు.

అలాంటి తిరుగుబాటు ప్రయత్నాలు కూడా ఉండవని నీరో వారికి చెప్పే ప్రయత్నం చేశారు.

“తొలి రోజుల్లో సెనేట్‌ విశ్వాసం పొందాలని నీరో శతవిధాలా ప్రయత్నించారు.

రోమ్‌కు ఒక మెరుగైన పాలకుడినని నిరూపించుకుంటానని వారికి నమ్మకం కలిగించాలనుకున్నారు” అంటారు సుష్మ.

అంతేకాదు, రోమ్ ప్రజలను సంతోషపరచడానికి నీరో క్రీ.శ 54లో గ్రీకుల్లాగే భారీ స్థాయిలో క్రీడాపోటీలు నిర్వహించారు.

ఆ క్రీడలతోపాటూ ప్రజలకు వినోదం అందించడానికి సర్కస్ లాంటి చాలా ప్రదర్శనలు పెట్టించేవారు.

చారిత్రక సందర్భాలను బట్టి నీరో పాలన తొలిరోజులను రోమ్ స్వర్ణయుగం అనవచ్చని బ్రిటన్ సెయింట్ జాన్స్ కాలేజ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాథ్యూ నికొల్స్ చెప్పారు.

“ఆధునిక కాలంలో కూడా ప్రజల్లో పాపులారిటి పెంచుకోవడానికి పాలకులు మొదట్లో చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

కానీ, మెల్లమెల్లగా వారి పాలనా పద్ధతుల వల్ల ఆ జనాదరణ తగ్గిపోతోంది” అని బ్రిటన్ సెయింట్ జాన్స్ కాలేజ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాథ్యూ నికొల్స్ అన్నారు.

నీరోకున్న జనాదరణ ఆయన చివరి రోజుల వరకు అలాగే కొనసాగిందని మాథ్యూ చెప్పారు.

జూలియస్ క్లాడియస్ రాజవంశంలో నీరో ఐదవ, చివరి చక్రవర్తి అన్నారు.

“నీరో అధికారంలోకి వచ్చేటప్పటికి ఆయన ముందు చాలా సమస్యలు ఉన్నాయి.

ఆయన గద్దెనెక్కినపుడు పాలన స్థిరంగా ఉంది. కానీ, అధికారం కోసం కుటుంబంలో తీవ్ర సంఘర్షణ, కుట్రలు జరుగుతున్నాయి.

దీంతోపాటూ సెనేట్‌లోని సంపన్న వర్గాలను సంతృప్తి పరచడం కూడా చాలా ముఖ్యం. ప్రాంతీయ గవర్నర్ దగ్గర సైన్యం ఉండేది.

వీటన్నిటికంటే ముఖ్యంగా రోమ్ ప్రజలకు క్రీడలు, సంబరాలు అంటే చాలా ఆసక్తి.

దానికి తగినట్లు ఏవైనా చేయాల్సిన అవసరం నీరోకు వచ్చింది” అని మాథ్యూ అన్నారు.

నీరో వాటన్నింటినీ బ్యాలెన్స్ చేయాల్సి వచ్చింది. ఆయన అందరినీ సంతృప్తిపరచాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.

చక్రవర్తి అయ్యే సమయానికి, ఆయన పాలన అంతమయ్యే సమయానికి రోమ్ సామ్రాజ్యంలో తేడా లేదా అనే ప్రశ్నకు కూడా మాథ్యూ సమాధానం ఇచ్చారు.

“ పాలనాకాలంలో రోమ్ సామ్రాజ్యాన్ని విస్తరించలేదు.

కానీ దానిని అప్పుడు సుస్థిరంగా ఉంచడం కూడా ఒక సవాలే” అన్నారు.

కొత్తగా సాధించిన విజయాలేవీ లేకపోవడంతో కప్పం రావడం కూడా ఆగిపోయింది.

అలాంటి పరిస్థితుల్లో దానిని సుస్థిరంగా ఉండేలా చూసుకోవడం చాలా కష్టమైపోతుందని మాథ్యూ చెప్పారు.

రోమ్ తగలబడుతున్నప్పుడు నీరో ఫిడేలు వాయిస్తున్నారా

క్రీ.శ. 64వ సంవత్సరంలో రోమ్ తగలబడి బూడిదైపోయింది.

నీరో స్వయంగా నగరానికి నిప్పు పెట్టించారని, రోమ్ తగలబడుతుంటే ఆయన ఫిడేలు వాయిస్తున్నారనే వదంతులు ఉన్నాయి.

“నీరోనే స్వయంగా రోమ్‌కు నిప్పు పెట్టించారని, అలా రోమ్‌ను మళ్లీ కొత్తగా నిర్మించవచ్చని భావించారని రెండు, మూడో శతాబ్దంలో కనీసం ఇద్దరు చరిత్రకారులు ధ్రువీకరించారు.

తర్వాత నీరో తన ప్రముఖ గోల్డెన్ హౌస్‌ను నిర్మించాలని కూడా అనుకున్నారు” అని బ్రిటన్ సౌత్ హాంప్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుష్మా మలిక్ చెప్పారు.

కానీ కొంతమంది చరిత్రకారులు మాత్రం ఈ మంటలు ఆయన పెట్టించలేదని వాదిస్తున్నారు.

ఆ మంటల్లో ఆయన భవనం కూడా తగలబడిపోయిందని చెబుతున్నారు.

నీరో నిప్పు పెట్టించారనేది కేవలం వదంతులేనని అదే కాలానికి చెందిన మరో చరిత్రకారుడు టెసిటస్ చెప్పారని సుష్మా మలిక్ తెలిపారు.

“నీరో స్వయంగా అలా చేశాడనడం హాస్యాస్పదం. తర్వాత నగరాన్ని నీరో చాలా చక్కగా మళ్లీ నిర్మించారు.

ఇంకోసారి అగ్నిప్రమాదం జరిగితే మంటలు వేగంగా అంటుకోకుండా విశాలమైన రహదారులు నిర్మించారు. మెరుగైన నిర్మాణ సామగ్రి ఉపయోగించారు” అన్నారు.

కానీ నీరోనే స్వయంగా నగరానికి నిప్పు పెట్టించినట్లు రెండు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయని మాథ్యూ చెప్పారు.

ఒక దానిలో నగరం తగలబడుతున్నప్పుడు నీరో ప్రత్యేక దుస్తులు ధరించి పాటందుకున్నారని వాటిలో ఉందని తెలిపారు.

రోమ్ తగలబడుతుంటే, నీరో ఫిడేలు వాయిస్తున్నారనేది ఎంత వరకూ నిజం అనే ప్రశ్నకు కూడా బ్రిటన్ సెయింట్ జాన్స్ కాలేజ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాథ్యూ నికొల్స్ సమాధానం ఇచ్చారు.

“ఫిడేలును ఏడో శతాబ్దంలో ఆవిష్కరించారు. నీరో కాలంలో అది లేదు.

ఆ సమయంలో నీరో కచ్చితంగా ఒక వాయిద్యాన్ని వాయించారు. కానీ దానిని లైర్ అంటారు” అని మాథ్యూ చెప్పారు.

క్రైస్తవులను సజీవ దహనం చేశారనే ఆరోపణలు

రోమ్ నగరానికి నిప్పు పెట్టారని నీరో మైనారిటీలైన క్రైస్తవులపై ఆరోపణలు వేశారు.

“అప్పటి రోమ్‌లో క్రైస్తవుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. క్రైస్తవుల మత విశ్వాసాల గురించి సామాన్యులకు చాలా తక్కువగా తెలిసేవి.

దాంతో వారిని అందరూ ద్వేషించేవారని టెసిటస్ ఒక పుస్తకంలో రాశారు” అని సుష్మా మలిక్ చెప్పారు.

అప్పట్లో మైనారిటీలైన క్రైస్తవులపై ఆరోపణలు చేయడం చాలా సులభం. వాటిని జనం సులభంగా నమ్మేశారు.

ఆ తర్వాత క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్న నీరో, నగరానికి నిప్పుపెట్టినందుకు శిక్షగా వారిని బహిరంగంగా ఉరితీయించారు.

వారిని తోడేళ్లకు ఆహారంగా వేశారు. రాత్రిళ్లు క్రైస్తవులను సజీవ దహనం చేసేవారు. వాటిని చూడ్డానికి ప్రజలు భారీగా గుమిగూడేవారు అని చెప్పారు.

అరకొరగా మిగిలిన నీరో మహల్

రోమ్ తగలబడిన తర్వాత నీరో ఒక భారీ భవనాన్ని నిర్మించారు. అందులో ఒక బంగారు గది ఉండేదని, లోపల అద్భుతమైన ఫర్నీచర్, గదిలో సువాసన కోసం గోడల్లో పెర్‌ఫ్యూమ్ పైపులు కూడా ఉండేవని చెబుతారు.

ఆ భవనం నిర్మించడానికి నీరో భారీగా ఖర్చు చేశారు. కానీ దానిని ఎప్పటికీ పూర్తి చేయలేకపోయారు.

బూడిద కుప్పల నుంచి బయటపడ్డానికి ప్రయత్నిస్తున్న ఒక నగరంలో అంత భారీ భవనం నిర్మించడంపై ప్రజలు అసంతృప్తితో ఉండేవారు.

దాంతో ఆ భవనాన్ని మీకోసం తెరుస్తామని, అక్కడ క్రీడలు, వేడుకలు నిర్వహిస్తామని నీరో వారిని సంతృప్తిపరిచేవారు.

లైర్ వాయిస్తూ, పాటలు పాడడమంటే నీరోకు ఇష్టం. ఆయన వేదికపై నటించేవారు కూడా.

చక్రవర్తికి అలాంటి అభిరుచులు ఉండడం సెనేట్ దృష్టిలో ఆయన ప్రతిష్టకే వ్యతిరేకం. కానీ నీరో ఎవరినీ పట్టించుకునేవారు కాదు.

ఆయన ఒకసారి సెలవు పెట్టి గ్రీస్ వెళ్లిపోయారు. అక్కడ థియేటర్లలో నాటక పోటీల్లో పాల్గొన్నారు.

‘ప్రజా శత్రువు’ నాటకీయ మరణం

30వ ఏట అడుగు పెట్టేసరికే నీరో చాలా అప్రతిష్ట మూటగట్టుకున్నారు, ఆయన పట్ల వ్యతిరేకత పెరిగిపోయింది.

దీంతో సైన్యం సాయంతో సెనేట్.. నీరోను ‘ప్రజా శత్రువు’గా ప్రకటించింది.

అంటే ఒక విధంగా అది నీరోకు మరణ శాసనం లాంటిది. అంటే నీరో ఎక్కడ కనిపించినా చంపేయాలి.

సైనికులు ఆయన్ను వెంటాడేవారు. నీరో ఒకరోజు రాత్రి చీకట్లో పారిపోయి నగరం బయట ఉన్న తన ఒక మహల్‌లో దాక్కున్నారు. తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు.

ఆత్మహత్య చేసుకున్నప్పుడు నీరో చివరగా “క్వాలిస్ ఆర్టిఫెక్స్ పెరియో” అనే మాట అన్నట్టు చెబుతారు.

అయితే ఆయన చివరి మాటలకు అర్థం కచ్చితంగా తెలుసుకోవడం కష్టమని నిపుణులు అంటున్నారు.

కానీ ఆ మాటకు చాలా అర్థాలు ఉండచ్చు.

“నేను నా మరణంలో కూడా ఒక కళాకారుడినే”

“నాతోపాటు కళాకారుడు కూడా చచ్చిపోతున్నాడు”

“నేను ఒక వ్యాపారిలా మరణిస్తున్నాను”

నీరో మాటలకు వీటిలో ఏ అర్థం అయినా రావచ్చు. కానీ ఆయన చివరి మాటలు ఆయన చరిత్రలాగే నాటకీయతతో మిగిలిపోయాయి.

#Health #Diet : నమ్మకాలు-నిజాలు.. చికిత్స-పత్యం

1

కడుపుతో ఉందనీ, బాలింతరాలనీ గత తొమ్మిది పది నెలలుగా కుమారికి పత్యపు కూడే పెడుతున్నారు.

ఈరోజేమైనా సరే.. పకోడీలు తినాల్సిందేనని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. రెండు వారాల పసిబిడ్డ ఏడుపు వినపడడంతో వెంటనే పడగ్గదిలోకి పరుగు తీసింది.

కాసేపటికి కుమారి అత్తగారు వంటగదిలోంచి బయటకు వచ్చి, అందరికీ తలో ప్లేటు పకోడీలు ఇచ్చింది. ఆశగా చూస్తున్న కుమారి వేపు తిరిగి..

“అమ్మాయ్ నువ్వు శెనగపిండి వస్తువులు తినడానికి వీల్లేదుగా.. పచ్చి బాలింతరాలివి పైగా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని పదిహేను రోజులు కూడా దాటలేదాయె.

ఆ డబ్బాలో నాన్ రొట్టుంది తిను. వేడి వేడిగా టీ ఇస్తాలే” అని, పకోడీలు తినాలన్న కుమారి ఆశపై నీళ్లు జల్లింది.

కుమారి కథ అలా ఉంటే ఇక్కడ మరో కథ…

జలుబు, జ్వరంతో బాధపడుతున్న జనార్దన్‌.. పసుపు వేసిన పాలు, రొట్టె తప్ప ఇంకేమీ తినకూడదని వాళ్లావిడ అంటోంది.

ఇంకోపక్క… ఏడు నెలల గర్భిణిగా ఉన్న కీర్తన ఎండలకి దాహం ఎక్కువై, కొబ్బరి నీళ్లు తాగుదామని కొబ్బరి బొండం తెప్పించుకుంది.

“రామ రామ గర్భిణిలు కొబ్బరి నీళ్లు తాగితే ఇంకేమన్నా ఉందా? పుట్టబోయే బిడ్డకి జుట్టు మొలవకుండా బోడిగుండు అయిపోదూ” అంటూ ఆ నీళ్లు అవతల పారబోసింది వాళ్లమ్మ.

ఇక కామేశ్వరరావు కథ మరీ అన్యాయం. పచ్చ కామెర్లు తగ్గి ఆరు నెలలు గడిచినా, భర్తకు ఇంకా చప్పిడి మెతుకులే వడ్డిస్తూ ‘అమ్మో.. స్త్రీ పత్యం!’ అంటూ తన మీద చెయ్యి వెయ్యనీయడం లేదు భార్య కమల.

అసలు.. పత్యం అంటే ఏమిటీ? పత్యం లేకపోతే ప్రమాదమా? ఎన్నాళ్లు చేయాలి?

ఈ విషయంలో డాక్టర్లు ఏమంటున్నారో ఓసారి చూద్దామా..

పత్యమంటే ఒక మనిషికి వచ్చిన జబ్బుకు, వారు తీసుకునే చికిత్సకు వ్యతిరేక ఫలితాలనిచ్చే పదార్థాలు తీసుకోకుండా, అనుకూలంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడమే.

మనదేశంలో పురాతన కాలం నుంచీ ఉన్న ఆయుర్వేదమూ, ఇంకా ఇతర ప్రత్యామ్నాయ వైద్య విధానాలలో ఈ పత్యానికి ప్రధాన స్థానమిచ్చినట్టు కనపడుతుంది. అందుకే మన దేశంలో పత్యాలెక్కువ.

ఆధునిక వైద్య విధానంలో ఏవో కొన్ని జబ్బులకు తప్ప దాదాపు కఠినమైన పత్యాలు లేవనే చెప్పాలి.

విదేశాల సంగతి నాకు పెద్దగా తెలీదు కానీ మన దేశంలో ఈ పత్యాల గురించి ప్రజలలో చాలా అపోహలున్నాయి.

అవి ఏ స్థాయిలో ఉంటాయంటే ఒక్కోసారి రోగి పత్యమేమీ లేదు అన్న డాక్టర్ని అనుమానంగా చూడటం, అతన్ని సమాధానపరచడానికి డాక్టర్ నానా యాతనా పడటం కద్దు.

అందుకే డాక్టర్‌కి రోగనిర్థారణ చెయ్యడమూ, దానికి తగిన చికిత్స చేయడమూ, రోగికి తన జబ్బుగురించి చక్కని అవగాహన కల్పించడమూ ఒక ఎత్తయితే ,రోగిని సంతృప్తి పరచే పత్యాలు చెప్పడం ఇంకొ ఎత్తు.

సంతృప్తిపరచే అని ఎందుకంటున్నానంటే మనదేశంలో రోగీ, అతని చుట్టుపక్కల వాళ్లూ కూడి డాక్టర్ సామర్థ్యాన్ని చికిత్స ఇవ్వడంలోనే కాక, పత్యాలు చెప్పడాన్ని బట్టి కూడా అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు.

అందుకే కొంతమంది డాక్టర్లు ప్రమాదం కలిగించని తేలికపాటి ఒకటి రెండు పత్యాలు చెపుతూ వుంటారు.

మరి ఆధునిక వైద్య విధానం అసలు ఏం చెబుతోంది అంటే శరీర ధర్మాన్ని అనుసరించి ఆహారం తీసుకోమని… అంటే ఉదాహరణకి రోగికి దాహం వేస్తోంది అంటే, శరీరంలో నీరు తక్కువయింది, అడుగుతోంది అని అర్థం.

ఆకలి వేస్తోంది అంటే జీర్ణశక్తి బాగానే ఉంది, ఆహారం అవసరం అని అర్థం.

జ్వరాలూ-పత్యాలూ

సాధారణంగా వచ్చే జ్వరాలకి పత్యమంటూ ప్రత్యేకంగా ఉండదు.

ఆకలి బాగుంటే భోజనం చేయవచ్చు, అంతగా ఆకలి లేకపోతే, తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు పాలూ,రొట్టే లేదా మజ్జిగన్నం, కాఫీ, బిస్కట్ వగైరాలు తినవచ్చు.

కానీ టైఫాయిడ్ జ్వరంలో మాత్రం తప్పనిసరిగా ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించమంటాం.

ఎందుకంటే కలుషితమైన నీటివల్లా, కలుషితాహారం వలన శరీరంలో ప్రవేశించిన టైఫాయిడ్ సూక్ష్మజీవులు ఆహారపు పేగు గోడలలోని లింఫాటిక్ టిష్యూలో కాపురమేర్పరుచుకుంటాయి.

రోగి ఘన పదార్థాలు తీసుకోవడం వలన, అవి వృధ్ధి పొంది జ్వరం తగ్గకుండా ఇబ్బంది పెడుతుంది.

అందుకే టైఫాయిడ్ తగ్గుముఖం పట్టే వరకూ కాచి చల్లార్చిన నీళ్లు, తేలికగా జీర్ణమయ్యే ద్రవ పదార్థాలూ, జావలూ తాగమంటాం.

జ్వరం తగ్గిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఘన పదార్థాలూ, కూరా అన్నం తినమని చెబుతూ ఉంటాం.

పత్యం పెట్టాక రోగిని నిద్ర పోనివ్వకుండా నానా హింసా పెట్టేస్తుంటారు చాలామంది.

కోలుకునే దశలో శరీరం ఎక్కువ విశ్రాంతి కోరుకుంటుంది కాబట్టి రోగిని నిద్రపోనివ్వడంలో తప్పులేదు.

ఆపరేషన్లూ – పత్యాలూ

ఇక ఆపరేషన్ జరిగిన వాళ్లల్లో అయితే అది జరిగి ఆర్నెల్లయినా పత్యాల విషయంలో పెట్టే ఇబ్బంది అంతా, ఇంతా కాదు.

కందిపప్పూ, పెసరపప్పూ, శెనగపప్పూ, శెనగపిండీ ఇవేమీ తిన కూడదనీ తింటే కుట్లకు చీము పడుతుందనీ భయపెడతారు. నిజానికి పప్పులలో ప్రొటీన్లుంటాయి.

అవి శరీరానికి ఎంతో అవసరం. చీము పట్టడానికి కారణం, శారీరక అపరిశుభ్రత, పరిసరాల అపరిశుభ్రతా, ఆపరేషన్ పరికరాలు సరిగా స్టెరిలైజ్ చేయకపోవడం, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం, షుగర్ ఉండటం, ఇంకా కొన్ని ఇతర అంశాలు కారణమవుతాయి.

కానీ, తినే వస్తువుల వల్ల చీము తయారవదు. చీము పట్టే వస్తువులంటూ ఉండవు.

గర్భిణులూ పత్యాలూ

గర్భిణులలో పత్యాల పట్ల ఉండే అపోహలకు అంతే లేదు.

కొబ్బరి నీళ్లు తాగితే పుట్టబోయే పిల్లలకి జుట్టు రాదనీ, తలకాయ కొబ్బరి బొండంలా తయారవుతుందనీ. బొప్పాయి తింటే అబార్షన్ అవుతుందనీ. నువ్వులుండలు తింటే వేడనీ. వంకాయ తింటే వాతమనీ.

బీరకాయ, సొరకాయ నెమ్ము చేస్తాయనీ. కొబ్బరి తింటే దగ్గొస్తుందనీ… ఇలా ఉంటాయి. ఇవన్నీ నిరాధారమైన అపోహలని వేరే చెప్పక్కరలేదు.

ఆమెకు కావలసింది అన్ని రకాలయిన ఆహార పదార్ధాలూ కలిసిన పరిశుభ్రమైన సమతులాహారం.

కాన్పు నెప్పులు మొదలవగానే తలస్నానం చేయించి, ఆమె ఏదికోరితే అది పెట్టాలని మాంసాహారం లాంటివి తినిపించి తీసుకొస్తారు.

ఇక చూడాలి ఆమె పాట్లూ, మా పాట్లూ. కానుపు నెప్పుల తీవ్రతకి చాలాసార్లు తిన్నదరక్క వాంతి అయిపోయి హైరానా అవడం. మామూలు కానుపయితే కొంతవరకూ నయమే.

ఆపరేషన్ చెయ్యవలసి వస్తే మత్తిచ్చే సమయంలో ఆహార పదార్థాలు ఊపిరితిత్తులలోకి వెళ్లిపోయి పేషెంట్ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది. దీనినే “ఆస్పిరేషన్ న్యూమోనియా”అంటారు.

కాబట్టి కానుపు సమయంలో సాధ్యమయినంత వరకూ తేలికపాటి ద్రవాహారం ఇస్తే మంచిది.

బాలింతలూ – పత్యాలూ

ఇక బాలింతరాళ్లలో పెట్టే కఠిన పత్యాల సంగతి సరేసరి. చాలా కూరగాయలను పత్యం పేరుతో తిననివ్వరు.

కారప్పొడీ, నెయ్యీ, వెల్లుల్లీ విస్తారంగా వాడి మజ్జిగా, పెరుగూ ఇవ్వకుండా, ఎంత దాహమేసి నాలుక పీక్కున్నా మంచినీళ్లు చిన్న, చిన్న గ్లాసులతో కొలిచి ఇస్తారు.

దాని వలన డీహైడ్రేషనూ, యూరిన్ ఇన్‌ఫెక్షన్ లాంటి కాంప్లికేషన్ల బారిన పడతారు.

పాశ్చాత్య దేశాలలో ఇంత అన్యాయం లేదనుకుంటా. ప్రసవం కాగానే చక్కని బలవర్థకమయిన ఆహారం ఇస్తారు.

నిజానికి బిడ్డకు పాలివ్వాలంటే బాలింతరాలికి కావలసింది సమతులాహారం… అంటే పాలూ, పండ్లూ, ప్రొటీన్లూ సమృధ్ధిగా ఉండే ఆహారం.

పచ్చకామెర్లూ – పత్యాలూ

పచ్చ కామెర్లు అనేది కాలేయానికేదైనా సమస్య వచ్చినపుడు బయటకు కనిపించే లక్షణం.

అంటే కాలేయానికి సంబంధించిన ఏ వ్యాధి వచ్చినా మనకు బయటకు కనిపించే లక్షణం పచ్చకామెర్లు. ఇది రక్తంలో బిల్ రుబిన్ అనే పదార్థం స్థాయిని మించి ఉండటం వలన వచ్చే జబ్బు.

ఈ స్థాయిని కాలేయం నియంత్రిస్తూ ఉంటుంది.

బిల్ రుబిన్ స్థాయి పెరిగినపుడు, ఒళ్లంతా పచ్చబడటం, కళ్లు పచ్చబడటం, మూత్రం పచ్చగా రావడంతో బాటు, ఆకలి లేకపోవడం, జీర్ణశక్తి తగ్గడం, నీరసం, నిస్త్రాణ లాంటి లక్షణాలుంటాయి.

కాలేయ వ్యాధులకు అనేక కారణాలున్నాయి. జన్యుపరమైన లోపాల నుంచీ కేన్సర్ వరకూ లివర్ వ్యాధికి కారణమవవచ్చు.

వాటిలో సాధారణంగా మనం చూసేవి, అప్పుడే పుట్టిన బిడ్డలో రక్తం మారి కొత్త రక్తం ఏర్పడేటప్పుడు వచ్చే “ఫిజియొలాజికల్ జాండిస్” ఒకటి.

ఇది బిడ్డ పుట్టిన మూడు నాలుగు రోజులకు మొదలయి, వారం రోజులకు దానంతట అదే తగ్గు ముఖం పడుతుంది.

సాధారణంగా ఏ చికిత్సా అవసరం వుండదు.

అరుదుగా బిల్ రుబిన్ స్థాయి పెరిగితే పిల్లల డాక్టర్లు ఫొటోథెరపీ ఇస్తారు లేకుంటే కాసేపు పొద్దుటే వచ్చే లేత ఎండలో బిడ్డను ఉంచితే సరిపోతుంది.

ఇంకా కొన్ని జన్యు పరమైన లోపాలు, పిత్తాశయంలో వచ్చే రాళ్లూ, ఆల్కహాలూ, కొన్ని రకాల మందులూ, ఇన్ఫెక్షన్లూ, కేన్సర్లూ, అనేక రకాల కారణాల వలన కామెర్లు వస్తాయి.

సాధారణంగా కామెర్లు కలగ జేసేది హెపటైటిస్ ఏ,బీ వైరస్‌లు.

హెపటైటిస్ ఏ – కలుషిత నీరు, ఆహారం వలనా వస్తుంది. సాధారణంగా దానంతట అదే తగ్గి పోతుంది. రోగి నీరస పడకుండా సపోర్టివ్ థెరపీ ఇవ్వాలంతే.

హెపటైటిస్ బి – ప్రాణాంతకమైన వ్యాధి. కలుషిత రక్తం ద్వారానూ, ఇంజెక్షన్ సూదుల ద్వారా, శారీరక సంబంధాల ద్వారా వ్యాపిస్తుంది. ఒకసారి వచ్చాక నివారణ ఉండదు. ఉపశాంతిగా మందులు వాడగలం. వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా టీకాలు వేసుకోవాలి. ఇంకా హెపటైటిస్ సి,డి,ఇ అనేవి కూడా ప్రమాదకరమైన వ్యాధులే .

కామెర్లకి ఇన్ని రకాల కారణాలుండగా అవేమీ తెలుసుకోకుండా ఒళ్లు పచ్చబడగానే, నాటుమందులనీ, వాతలేయించుకోవడమనీ, పత్యాలనీ రోగిని నానా హైరానా పెట్టేస్తూ ఉంటారు.

కొన్ని ప్రాంతాలలో నానా విధాలైన ఆకుపసర్లు మింగించడంతో పాటు, విరేచనాలకి ఆముదం తాగించడం, మణికట్టుమీద ఒక ఇనప రింగుతో కాల్చి వాతలు పెట్టి దానిమీద ఏదో గుడ్డవేసి,

ఆపైన నూనె పోసి, పప్పు పదార్థాలవీ పెట్టి, ఆ గాయం చీము పడితే ఆ చీము ద్వారా లోపలున్న కామెర్ల వ్యాథి బయటకు పోతుందని భావిస్తారు.

ఇదంతా చాలా అనాగరికమైన, ప్రమాదకరమైన వ్యవహారం. అసలే కాలేయం బలహీనంగా ఉండి జీర్ణశక్తీ,

వ్యాధి నిరోధక శక్తీ తక్కువగా ఉండటం వలన అనేక కాంప్లికేషన్ల బారిన పడే ప్రమాదం వుంది. పైగా ఈ వాతల వలన ధనుర్వాతం కూడా రావచ్చు.

కామెర్లు వచ్చి తగ్గిన చాలా కాలం వరకూ స్త్రీ పత్యం అనే పేరుతో దాంపత్య జీవితానికి దూరంగా వుంచుతారు.

హెపటైటిస్ ఏ, బీ కామెర్లు ముఖ్యంగా బీ రకం కామెర్లు దాంపత్య సంబంధాల వలన ఒకరి నుంచి ఒకరికి సోకుతాయి కాబట్టి,

జీవిత భాగస్వామి రక్తంలో ఆ సూక్ష్మజీవులు అప్పటికే ప్రవేశించాయో లేదో పరీక్షించి, ఆ సూక్ష్మజీవులు రక్తంలో లేకపోతే టీకాలు ఇచ్చి జబ్బువచ్చిన రోగి జీవిత భాగస్వామినీ,

ఇంట్లో ఉండే వారందరినీ వ్యాధి సోకకుండా కాపాడవచ్చు. ఇప్పుడు బిడ్డ పుట్టిన వెంటనే హెపటైటిస్ బి టీకాలు వేసి జీవితకాల రక్షణ కలిపిస్తున్నారు. ఇది శుభ పరిణామం.

కామెర్లు కనపడగానే భయపడకుండా డాక్టర్ వద్దకు వెళ్లి ఏ రకమైన కామెర్లో నిర్థారించుకుని, సాధారణ రకాలయితే దానికి తగిన తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలూ,

విశ్రాంతీ తీసుకుంటూ, రక్తంలో బిల్ రుబిన్ శాతం తగ్గుముఖం పట్టగానే మామూలు ఆహారం తీసుకుంటూ, సాధారణ జీవితం గడపొచ్చు.

చాలా వ్యాధులకి కారణం కలుషితమైన నీరూ, ఆహారం, అపరిశుభ్రమైన అలవాట్లూ, పరిసరాలూ కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.

ఆహారంలో చీము పట్టే వస్తువులుంటాయని చెప్పి దెబ్బలు తగిలిన వాళ్లని, ఆపరేషన్లు జరిగిన వాళ్లని బలవర్థకమయిన ప్రోటీన్లు కలిగి ఉన్న పప్పు పదార్థాలకి దూరంగా ఉంచడం సరికాదు.

ఎవరికి తోచిన పత్యాలు వాళ్లు చేయకుండా డాక్టరు సలహాలు పాటించడం వలన రోగి తొందరగా కోలుకుని వ్యాధి బారినుంచి బయట పడే అవకాశ ముంది.

ఈ వేళ ఉండండి మరింత జాగ్రత్త…

0

వర్షాకాలంలో సాదారణంగా చాలా ప్రాంతాల్లో ప్రతి ఏటా కరెంటు ప్రమాదాలు జరగడం వింటూనే ఉంటాం.

అయితే ఈ వానల్లో మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళకు ఇనుప స్థంబాల పట్ల అప్రమత్తంగా ఉండేలా సూచనలు చేయండి.

అవగాహన, జాగ్రత్తతో కొన్ని ప్రాణాలు అయినా మిగులుతాయి. అలాగే గుంతలు, మ్యాన్​హోల్​ల పట్ల జాగ్రత్తగా ఉండండి.

సాదారణ నీటి గుంటనే అనుకుని పెద్ద గుంతల్లో పడి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది.

దీంతో పాటు చిన్నారుల పట్ల సాదారణ సమయంలో కంటే ఇప్పడు కాస్త జాగ్రత్తగా ఉండండి.

#SputnikV #Covaxin #Covishield : వ్యాక్సీన్లను ఎలా తయారుచేశారు? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

0

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కేసులు వేగంగా పెరుగుతున్న సమయంలో రష్యా వ్యాక్సీన్‌కు అనుమతి లభించింది.

రష్యాకు చెందిన స్పుత్నిక్ వి టీకా సురక్షితమైనదని, ఇది భారత్‌లో కోవిషీల్డ్ పేరుతో తయారవుతున్న ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్‌లాగే పనిచేస్తుందని భావిస్తున్నారు.

స్పుత్నిక్ వి వ్యాక్సీన్ కోవిడ్-19 నుంచి దాదాపు 92 శాతం రక్షణ కల్పించగలదని ‘ది లాన్సెట్‌’లో ప్రచురించిన చివరి దశ ట్రయల్స్ ఫలితాలను బట్టి తెలుస్తోంది.

జులై చివరి నాటికి దేశంలో 25 కోట్ల మందికి టీకాలు వేయాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

కానీ భారత్‌లో వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోందని, వేగం పెంచకపోతే లక్ష్యాన్ని అందుకోవడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.

స్పుత్నిక్ వి గురించి మనకు ఎంత తెలుసు

మాస్కోలోని గమలేయా ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సీన్‌‌ చివరి ట్రయల్స్ ఫలితాలు రాక ముందు కాస్త వివాదాస్పదమైంది.

కానీ ఈ వ్యాక్సీన్‌తో ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పుడు నిరూపితమయ్యిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇది ఒక కోల్డ్ టైప్ వైరస్‌ను ఉపయోగిస్తుంది. అది శరీరానికి కరోనావైరస్ చిన్న భాగాన్ని అందించే ఒక కారియర్‌లా, ఎలాంటి హాని కలిగించకుండా పనిచేస్తుంది.

అలా ఈ టీకా వైరస్ జెనెటిక్ కోడ్‌కు తగ్గట్టు శరీరాన్ని సురక్షితంగా ఎక్స్‌పోజ్ చేస్తుంది. ముప్పును గుర్తించి, అనారోగ్యానికి గురవకుండా దానితో ఎలా పోరాడాలో గుర్తిస్తుంది.

టీకా వేసుకున్నాక శరీరం యాంటీ బాడీస్‌ను, ముఖ్యంగా కరోనావైరస్‌తో పోరాడే యాంటీ బాడీస్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది.

అంటే, కరోనావైరస్ నిజంగానే వ్యాపించినపుడు, రోగనిరోధక శక్తి దానితో పోరాడేలా సిద్ధంగా ఉంటుంది.

స్పుత్నిక్ వ్యాక్సీన్‌ను 2 నుంచి 8 సెంటీగ్రేడ్‌ డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య (సాధారణ ఫ్రిజ్‌ ఉష్ణోగ్రత) నిల్వ చేయవచ్చు.

రిపోర్టుల ప్రకారం ఈ టీకాను మార్కెటింగ్ చేస్తున్న రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) భారత్‌లోని ఆరు వ్యాక్సీన్ తయారీదారులతో కలిసి 75 కోట్ల డోసుల ఉత్పత్తికి ఒప్పందం చేసుకుంది.

కానీ దీని రెండో డోస్ భిన్నంగా ఉంటుంది

స్పుత్నిక్ టీకా రెండు డోసులు వేరువేరుగా ఉంటాయి.

ఈ టీకా మొదటి డోసు వేసుకున్న 21 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాలి.

కానీ దీని వెర్షన్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది.

రెండు డోసులూ కరోనావైరస్ స్పైక్‌ లక్ష్యంగా పనిచేస్తాయి. కానీ రెండు వేరు వేరు వెక్టర్స్(రోగ వాహకాలు) ఉపయోగిస్తాయి. న్యూట్రలైజ్ చేసిన వైరస్ శరీరంలోకి స్పైక్‌ను తీసుకెళ్తుంది.

ఒకే వెర్షన్‌ను రెండు సార్లు ఉపయోగించడానికి బదులు, రోగనిరోధక శక్తిని పెంచడానికి రెండు వేరు వేరు ఫార్ములాలు ఉపయోగించాలనే ఈ ఆలోచన కరోనా వైరస్ నుంచి శరీరానికి దీర్ఘకాలిక రక్షణను అందించవచ్చు.

సమర్థమైనదని నిరూపితం కావడంతోపాటూ ట్రయల్ సమయంలో స్పుత్నిక్ వ్యాక్సీన్ వల్ల ఎలాంటి సీరియస్ రియాక్షన్లు కలగలేదని, ఇది సురక్షితమైనది తేలింది.

ఈ వ్యాక్సీన్ వల్ల కొన్ని సైడ్ ఎపెక్ట్స్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కానీ, అవి చాలా తక్కువ. చెయ్యి నొప్పి, అలసట, తేలికపాటి జ్వరం లాంటివి ఉండచ్చు.

ఈ వ్యాక్సీన్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న వారిలో ఎవరికీ తీవ్ర అనారోగ్య సమస్యలు రావడం, చనిపోవడం జరగలేదు.

స్పుత్నిక్ వి టీకాను రష్యాతోపాటూ అర్జెంటీనా, పాలస్తీనా, వెనెజ్వెలా, హంగరీ, యూఏఈ, ఇరాన్ ఇంకా చాలా దేశాల్లో ఉపయోగిస్తున్నారు.

భారత్‌లో స్పుత్నిక్ వి టీకా వేయడం కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభమైంది.

కోవాగ్జిన్ గురించి మనకు ఏం తెలుసు?

అచేతనం చేసిన కరోనావైరస్ సాయంతో కోవాగ్జిన్‌ను తయారుచేశారు. వైరస్‌ను అచేతనం చేయడంతో దీన్ని శరీరంలోకి ఎక్కించినా మనకు ఎలాంటి హానీ జరగదు.

24ఏళ్లుగా 16కుపైగా వ్యాక్సీన్లను తయారుచేసిన చరిత్ర గల భారత్ బయోటెక్ దీన్ని అభివృద్ధి చేసింది. 123కుపైగా దేశాలకు సంస్థ వ్యాక్సీన్లను ఎగుమతి చేస్తోంది. భారత్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి సేకరించిన అచేతనమైన వైరస్ సాయంతో సంస్థ తాజా వ్యాక్సీన్‌ను తయారుచేసింది.

ఈ వ్యాక్సీన్‌ను తీసుకున్నవెంటనే, దీనిలోని వైరస్‌ను రోగ నిరోధక కణాలు గుర్తుపడతాయి. దీంతో వైరస్‌తో పోరాడేందుకు యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి.

నాలుగు వారాల తేడాలో రెండు డోసులను మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సీన్‌ను 2 రెండు నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంటుంది. ఇది 81 శాతం సామర్థ్యంతో పనిచేస్తోందని మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రాథమిక పరీక్షల్లో తేలింది.

మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తికాకముందే, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు, ఈ వ్యాక్సీన్‌కు భారత్‌ ఆమోదముద్ర వేసింది. దీనిపై చాలా మంది సందేహాలు వ్యక్తంచేశారు.

తమ దగ్గర 2 కోట్ల డోసుల వ్యాక్సీన్లు సిద్ధంగా ఉన్నాయని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ ఏడాది చివరినాటికి దేశంలోని రెండు పరిశ్రమల్లో మొత్తంగా 70 కోట్ల వ్యాక్సీన్లు తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది.

కోవాగ్జిన్‌పై వివాదం ఏమిటి?

ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి కోవాగ్జిన్‌కు అనుమతులు జారీ చేసినట్లు భారత ఔషధ ప్రాధికార సంస్థ జనవరిలో ప్రకటించడంతో ఈ వివాదం మొదలైంది.

పరీక్షలు పూర్తికాకముందే ఎలా అనుమతులు జారీచేస్తారని, లక్షల మందికి ఆ వ్యాక్సీన్లు ఎలా వేస్తారని నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. దీని వెనుక లాజిక్ ఏమిటో తమకు అసలు అర్థం కావడంలేదని ద ఆల్ ఇండియా డ్రగ్ యాక్షన్ నెట్‌వర్క్ వ్యాఖ్యానించింది. వ్యాక్సీన్ సామర్థ్యంపై సరైన సమాచారం లేకుండా అనుమతులు జారీచేయడంపై ఆందోళన వ్యక్తంచేసింది.

అటు ఔషధ ప్రాధికార సంస్థ, ఇటు భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌ను సమర్థించాయి. ”ఇది సురక్షితమైన వ్యాక్సీన్. శక్తిమంతమై రోగ నిరోధక స్పందనలను ఇది కలుగజేస్తోంది”అని చెప్పుకొచ్చాయి.

కోవిషీల్డ్ మాటేమిటి?

ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్‌ను భారత్‌లో ద సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థ. నెలకు ఆరు కోట్లకుపైగా వ్యాక్సీన్లను తాము తయారుచేస్తామని సంస్థ వివరిస్తోంది.

చింపాంజీల నుంచి సేకరించిన సాధారణ జలుబు వైరస్ (అడెనోవైరస్)ను బలహీన పరచడం ద్వారా ఈ వ్యాక్సీన్‌ను తయారుచేశారు. ఈ జలుబు వైరస్‌ను కరోనావైరస్ మాదిరిగా పనిచేసేలా మార్పులు చేశారు. అయితే, దీనితో ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకదు.

ఈ వ్యాక్సీన్‌ను తీసుకున్న వెంటనే, దీనిలోని డమ్మీ వైరస్‌ను కరోనావైరస్‌గా శరీరం భావిస్తుంది. వెంటనే ఇన్ఫెక్షన్‌తో పోరాడే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది.

12 వారాల తేడాతో ఈ వ్యాక్సీన్ రెండు డోసులను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సీన్‌ను 2 నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నిల్వ చేయాల్సి ఉంటుంది.

చాలా దేశాలు ఇప్పటికే ప్రజలకు ఇస్తున్న ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సీన్‌ను మైనస్ 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. భారత్‌లో వేసవిలో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే సంగతి తెలిసిందే.

కోవిషీల్డ్ ఎంత సామర్థ్యంతో పనిచేస్తుంది?

మొదట సగం డోసు, తర్వాత ఫుల్ డోసు తీసుకుంటే ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ 90 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని అంతర్జాతీయ క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది.

ఈ సగం-ఫుల్ డోసుల ఐడియాను సమర్థించేందుకు తగిన డేటా అందుబాటులో లేదు.

అయితే, రెండు డోసుల మధ్య ఎక్కువ సమయం ఉంటే, టీకా సామర్థ్యం పెరుగుతందని ఓ అధ్యయనంలో తేలింది. 70 శాతం సామర్థ్యంతో ఇది పనిచేస్తున్నట్లు వెల్లడైంది.

”బ్రెజిల్, బ్రిటన్‌లలో నిర్వహించిన మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సీన్ మంచి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు తేలింది”అని భారత్‌లో ఈ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్ వ్యాఖ్యానించింది. వ్యాక్సీన్ శక్తిమంతమైన రోగ నిరోధక స్పందనలను కలగచేయగలదా? దీని వల్ల ఏమైనా దుష్ప్రభావాలు వస్తాయా? లాంటి అంశాలు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో తెలుస్తాయి.

అయితే, భారతీయులపై ”బ్రిడ్జింగ్ స్టడీ” చేపట్టకుండానే ఆగమేఘాలపై ఈ వ్యాక్సీన్‌కు ఆమోదం తెలిపారని హక్కుల సంస్థ ఆల్ ఇండి డ్రగ్ యాక్షన్ నెట్‌వర్క్ వ్యాఖ్యానించింది.

ఇతర వ్యాక్సీన్లు ఇవీ…

భారత్‌లో పరీక్షల దశలోనున్న ఇతర వ్యాక్సీన్ల వివరాలు ఇవీ

1 జైకోవ్-డీ వ్యాక్సీన్‌ను అహ్మదాబాద్‌కు చెందిన జైడస్-క్యాడిలా అభివృద్ధి చేస్తోంది.

2 హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ సంస్థ అమెరికాకు చెందిన డైనావ్యాక్స్, బేలర్ కాలేజీ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి ఓ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేస్తోంది.

3 జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన వ్యాక్సీన్‌ను బయోలాజికల్-ఈ సంస్థ ఉత్పత్తి చేయనుంది.

4 భారత్‌లో తొలి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సీన్‌ హెచ్‌జీసీవో19ను సియాటెల్‌కు చెందిన హెచ్‌డీటీ సంస్థతో కలిసి పుణెకు చెందిన జెనోవా సంస్థ అభివృద్ధి చేసింది. వ్యాధి నిరోధక స్పందనలను ప్రేరేపించేందుకు దీనిలో జన్యు కోడ్‌ను ఉపయోగించారు.

5 ముక్కు ద్వారా వేసే ఓ వ్యాక్సీన్‌ను కూడా భారత్ బయోటెక్ సిద్ధం చేస్తోంది.

6 అమెరికా సంస్థ నోవావ్యాక్స్‌తో కలిసి సీరం ఇన్‌స్టిట్యూట్ ఓ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసింది.

ఏఏ దేశాలకు భారత్ వ్యాక్సీన్లు అందిస్తోంది?

లాటిన్ అమెరికా, కరీబియన్ దీవులు, ఆసియా, ఆఫ్రికాల్లోని 86 దేశాల కోసం 6.4 కోట్ల డోసులను భారత్ అందించింది. మరోవైపు అమెరికా, కెనడా, బ్రెజిల్, మెక్సికో తదితర దేశాలకూ భారత్ వ్యాక్సీన్లను సరఫరా చేసింది.

కొన్ని కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ వ్యాక్సీన్‌లను గిఫ్ట్‌ల రూపంలో భారత్ అందిస్తోంది. మరికొన్నింటిని వాణిజ్య ఒప్పందాల రూపంలో వ్యాక్సీన్ తయారీ సంస్థలు ఎగుమతి చేస్తున్నాయి. ఇంకొన్నింటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యక్రమం కోవాక్స్ కింద సరఫరా చేస్తోంది. ఈ ఏడాది చివరినాటికి 190 దేశాలకు రెండు బిలియన్ డోసులను కోవాక్స్ కింద సరఫరా చేయాలని డబ్ల్యూహెచ్‌వో భావిస్తోంది.

మార్చిలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ ఎగుమతులపై భారత్ తాత్కాలికంగా నిలుపుదల విధించింది. భారత్‌లో కేసుల పెరుగుతుండటంతో డిమాండ్‌కు అనుగుణంగా దేశీయ అందుబాటు పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.