బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు కోసం నెట్స్‌లో జట్లు చెమటోడ్చుతున్నాయి. భారత్, ఆస్ట్రేలియాల మధ్య బోర్డర్ గవాస్కర్ సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా భారత్, ఆస్ట్రేలియా కెప్టెన్లు బుమ్రా, పాట్ కమిన్స్ ట్రోఫీతో పోజిచ్చారు. గత రెండుసార్లు ఆస్ట్రేలియా గడ్డపై భారత్ సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని టీమ్ ఇండియా ఉవ్విళ్లూరుతోంది.అయితే గత కొద్ది రోజులుగా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పెద్దగా స్కోర్లు చేలేదు. న్యూజిలాండ్ వైట్‌వాష్, కీలక ఆటగాళ్ల గైర్హాజరు భారత జట్టును కలవరపెడుతున్నాయి. దీంతో అభిమానులు బౌలర్లపైనే ఆశలు పెట్టుకున్నారు. బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది.
భారత జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్/రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా/ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్).