కొంతమందిలో మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటతో బాధపడతారు. మూత్రంలో మంట అనేది మూత్రనాళ ఇన్ఫెక్షన్ కారణం అవ్వొచ్చు. అవును చాలామంది మళ్లీ మూత్ర విసర్జన చేసేటప్పుడు యోనిలో మంట లేదా పురుషాంగంలో తేలికపాటి నొప్పిని కూడా అనుభవిస్తారు. మొదట్లో చాలా మంది ఈ సమస్యను పట్టించుకోరు. అయితే ముందుగా జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రమైన సమస్యగా మారుతుంది. కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా ధనియాలు నానబెట్టిన నీటిని తాగడం వల్ల మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ధనియాలు యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి. అంతేకాదు ధనియాల వాటర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి