కోచింగ్ సెంటర్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. 100 శాతం జాబ్ గ్యారెంటీ, 100 శాతం సెలెక్షన్ వంటి తప్పుడు ప్రకటనలను నియంత్రించేందుకు కోచింగ్ సెంటర్లకు కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, అయితే ప్రకటనలనేవి వినియోగదారుల హక్కులను దెబ్బతీయకూడదని అధికారులు పేర్కొన్నారు.