Homeహైదరాబాద్latest Newsతైవాన్‌ను భయపెట్టిన చైనా

తైవాన్‌ను భయపెట్టిన చైనా

తైవాన్‌ , చైనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ ద్వీపంలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన లాయ్‌ చింగ్‌-తె.. తమను బెదిరించడం ఆపాలంటూ డ్రాగన్‌కు గట్టిగా చెప్పారు. దీంతో ఆగ్రహించిన బీజింగ్‌.. తైవాన్‌ చుట్టూ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. ‘పనిష్మెంట్‌’ పేరుతో వీటిని నిర్వహిస్తోంది.

గురువారం (మే 23) ఉదయం 7.45 గంటల ప్రాంతంలో ఈ ద్వీపం చుట్టూ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (PLA)కి చెందిన ఈస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌ మిలిటరీ డ్రిల్స్‌ ప్రారంభించిందని చైనా అధికారిక మీడియా వెల్లడించింది. “ఇండిపెండెన్స్ కోసం తైవాన్‌ దళాల వేర్పాటువాద చర్యలకు శిక్షగానే మేం ఈ విన్యాసాలు చేపట్టాం. మా విషయంలో బయటి శక్తుల జోక్యం, రెచ్చగొట్టే చర్యలకు ఇది మా హెచ్చరిక’’ అని ఈ కమాండ్‌ అధికార ప్రతినిధి లి షీ వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img