ఇదేనిజం, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం జగన్ విదేశాలకు వెళ్లనున్నారు. ఈ మేరకు తన భార్య భారతితో కలిసి మే 17 న లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జగన్‌కు ఇద్దరు కుమార్తెలు ఉండగా ఒకరు లండన్‌లో, మరొకరు అమెరికాలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని చూసేందుకు విదేశాలకు వెళ్లాల్సిందిగా అనుమతి కోరుతూ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. అక్రమాస్తుల కేసుల్లో ఈడీ, సీబీఐ ఆరోపణలు ఎదర్కొంటున్న సీఎం జగన్ దేశం విడిచిపెట్టి వెళ్లడానికి కోర్టు అనుమతి తప్పనిసరి.