CM KCR : ఎరువుల ధరలపై సీఎం కేసీఆర్ నిరసన
సాయంత్రం ప్రధానికి బహిరంగ లేఖ రాయనున్న సీఎం కేసీఆర్
ఎరువుల ధరల పెంపు నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసన తెలిపారు.
ఈ అంశంపై ఈ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాయాలని సీఎం నిర్ణయించారు.
దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేదిశగా కేంద్రం నిర్ణయం ఉందని అసంతృప్తి వెలిబుచ్చారు.
“దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేదిశగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుంది.
కేంద్రం ఎరువుల ధరలు పెంచి.. అన్నదాతల నడ్డి విరిచింది.
అక్కడ ఆ గొర్రె ధర రూ.1.50 కోట్లంట!
InteriorDesign #Bathroom : బాత్రూమ్‌లో ఏ టైల్స్ వేస్తే మంచిది..
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఊదరగొట్టి.. వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేసింది.
కేంద్రంలోని భాజపా పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం.
దేశంలో అన్నదాతలను బతకనిచ్చే పరిస్థితి లేదు.
వ్యవసాయ పంపుసెట్లకు మోటార్లు బిగించి బిల్లులు వసూలు చేస్తున్నారు.
ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయట్లేదు.
ఎరువుల ధరలను విపరీతంగా పెంచారు.
పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారు.
రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్రలు చేస్తున్నారు.
VIRALగా మారిన లేడీ బస్ డ్రైవర్ ఫొటో
7 ను అడ్డ గీతతో రాయడం ఎలా మొదలైంది
వ్యవసాయం, అనుబంధ రంగాలను నిర్వీర్యం చేసే కుట్రలను కేంద్రం అమలు చేస్తోంది.
గ్రామీణ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేసేలా కుట్రలు చేస్తోంది.
వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు చూస్తున్న భాజపాను.. కూకటివేళ్లతో పెకలించి వేయాలి”
-సీఎం కేసీఆర్
వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్న భాజపాను కూకటివేళ్లతో పెకలించి వేయాలని దేశ, రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల సబ్సిడీలను ఎత్తివేసి.. రైతులను వ్యవసాయం చేయకుండా చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై అన్నదాతలు నాగండ్లు ఎత్తి తిరగబడాలని..
వాస్తు ప్రకారం ఈ దిక్కున సింక్ ఉండొద్దా..
ఇంటర్వ్యూలో మొహంపై ఘోర అవమానాలు.. సర్జరీలతో షాకింగ్ మార్పు
లేకుంటే సాగును కాపాడుకోలేని పరిస్థితులు దాపురిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
భాజపాకు, కేంద్రానికి బుద్ధి వచ్చేదాకా.. ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
తక్షణమే పెంచిన ఎరువుల ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి కేంద్రం మెడలు వంచుతామని హెచ్చరించారు.
కేంద్రం కుట్రలను రాష్ట్ర రైతులు అర్థం చేసుకొని ధరలు తగ్గించే దాకా.. భాజపా ప్రభుత్వంపై చేసే పోరాటంలో కలిసిరావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
Hyderabad Clock Towers : క్లాక్ టవర్ల చరిత్ర.. స్వార్థం ఏంటి..