తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాలను అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చర్యల్లో భాగంగా వరంగల్ నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన నార్కోటిక్ పోలీస్ స్టేషన్ను కాళోజీ కళాక్షేత్రాన్ని మంగళవారం వర్చువల్ విధానంతో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నార్కోటిక్స్ విభాగం డైరెక్టర్ సందీప్ శాండిల్య, అడిషనల్ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్, ఎస్పీ సాయి చైతన్య సీఎంరేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందించారు.