Homeజిల్లా వార్తలుభక్తి ముసుగులో గంజాయి సాగు..!

భక్తి ముసుగులో గంజాయి సాగు..!


ఇదే నిజం, వట్ పల్లి: దేవాలయంలో భజనలు చేస్తాం. భజనలు చేసే సమయంలో గంజాయిని వినియోగిస్తామని, గంజాయిని వినియోగించడం అనవాయితీ అంటు తనకున్న 30 గుంటల స్థలంలో గంజాయిసాగు చేసి ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ పోలీసులకు పట్టుబడిన వైనం సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..సంగారెడ్డి వట్‌పల్లి మండలం మరవెల్లి గ్రామంలో జుట్టు చిన్న నర్సింహులు అనే వ్యక్తి 125/యు/2 అనే సర్వే నెంబరులోని 30 గుంటల స్ధలంలో పత్తి, మిరప సాగు మధ్యలో గంజాయి సాగు చేశాడు. ఈ సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ సీఐ సి. వీణారెడ్డి తన సిబ్బందితో వెళ్లి చేనులో పరిశీలించగా గంజాయి మొక్కలు కనిపించాయి. తన సిబ్బందితో కలిసి 20 గంజాయి మొక్కలను చేనుల్లోంచి తొలగించారు.

ఈ విషయం తెలుసుకున్న పట్టాదారు జుట్టు చిన్న నర్సింహులు అనే వ్యక్తి వారి కుటుంబ సభ్యులతో వచ్చారు. మా ఊరి దేవాలయంలో భజనలు చేసే సమయంలో ఈ గంజాయిని వినియోగిస్తామని, అమ్మకం కోసం కాద`ని సర్థిచెప్పె ప్రయత్నాలు చేశారు. కాని ఎన్ఫోర్స్ మెంట్‌ సీఐ సి. వీణారెడ్డి అందోల్‌ ఎక్సైజ్‌ పోలీసులకు అప్పగించారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్న టీంలో ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ టీంలో సీఐతోపాటు ఎస్సై అనిల్‌ కుమార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ ఇ.విఠల్‌, కానిస్టేబుళ్లు మల్కయ్య, అనిల్‌ కుమార్‌, పహ్లాద్‌ రెడ్డిలు ఉన్నారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్న ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ టీమ్‌ను తెలంగాణ ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి, మెదక్‌ డిప్యూటి కమిషనర్‌ హరికిషన్‌, అసిస్టేంట్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి, ఏఈఎస్‌ శ్రీనివాస రావు
అభినందించారు.

Recent

- Advertisment -spot_img