హీరోగానే కాకుండా దర్శకుడిగా, సింగర్‌గా ఆకట్టుకుంటున్నారు తమిళ నటుడు ధనుష్. ఆరేళ్ల క్రితం ‘పవర్ పాండి’ అనే సినిమాతో ఆయన దర్శకత్వం కూడా చేపట్టారు. ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కించారు. ‘డీ50’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఇది ప్రచారంలో ఉంది. తాజాగా దీని షూటింగ్ పూర్తయినట్లు చెప్పి ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్ను అందించాడు. ధనుష్‌కు ఇది 50వ సినిమా కాగా.. దర్శకుడిగా రెండోది. ఈ ఏడాది జనవరిలో దీన్ని అధికారికంగా ప్రకటించారు. జులైలో షూటింగ్ ప్రారంభమైనట్లు పోస్ట్ పెట్టారు. నేడు ఈ సినిమా పూర్తయినట్లు వెల్లడించారు. ‘ఈ సినిమాకు సహకరించిన నటీనటులకు హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అందరి సహకారంతోనే దీన్ని ఇంత తర్వగా పూర్తిచేయగలిగాం’ అంటూ నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దీంతో అభిమానులు అతడికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఇంత సైలెంట్‌గా సినిమా మొత్తం ఎలా పూర్తి చేశావంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ ఏడాది ‘సార్’ సినిమాతో సూపర్ హిట్‌ను అందుకున్న ధనుష్.. ప్రస్తుతం తన 50వ చిత్రంతో పాటు ‘కెప్టెన్ మిల్లర్’లో నటిస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం అలరించనుంది. 1980కాలం నాటి కథల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్‌గా దీనిని రూపొందిస్తున్నారు. ప్రియాంక మోహన్, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.