Homeహైదరాబాద్latest Newsఅల్లు అర్జున్ ఆస్తి విలువలో మొత్తం ఎంతో తెలుసా..?

అల్లు అర్జున్ ఆస్తి విలువలో మొత్తం ఎంతో తెలుసా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమాలుతో స్టార్ హీరోగా ఎదిగాడు. తన సినీ కెరీర్ లో పలు హిట్‌లు ఇచ్చినప్పటికీ ‘పుష్ప’ సినిమా మాత్రం పాన్ ఇండియా రేంజలో హిట్‌గా నిలించింది. ఈ సినిమా అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తను నటిస్తున్న ‘పుష్ప 2’ సినిమాకి 300 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఆయన మొత్తం ఆస్తి విలువ 650 కోట్లకు చేరింది.అల్లు అర్జున్‌కి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో బంగ్లా ఉంది. మల్టీ మిలియనీర్లు నివసించే కాస్ట్లియానా ప్రాంతంలో ఉన్న ఈ లగ్జరీ బంగ్లా విలువ రూ. 100 కోట్లు. అతను రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడి పెట్టాడు మరియు ముంబైలో డబుల్ బెడ్‌రూమ్ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కలిగి ఉన్నాడు.అల్లు అర్జున్ నటుడిగానే కాకుండా తన నిర్మాణ సంస్థ అల్లు స్టూడియోస్ నుండి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. దీంతో పాటు గతేడాది హైదరాబాద్‌లో ఏఏఏ సినిమాస్ అనే మల్టీప్లెక్స్‌ను కూడా ప్రారంభించాడు. దీంతో అల్లు అర్జున్ ఆస్తి విలువలో 650 కోట్లకు చేరింది.

Recent

- Advertisment -spot_img