తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ నడుస్తుంది. తాజాగా ఈ వివాదానికి ముగింపు పడింది. చిక్కడపల్లి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను నిన్న పోలీసుల అరెస్ట్ చేసారు. అయితే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ జైలులో ఉన్నపుడు అతని ఇంటికి చిరంజీవి వెళ్లారు. శనివారం జైలు నుండి విడుదలైన అల్లు అర్జున ఈరోజు కుటుంబ సభ్యులతో సహా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై బన్నీ చిరంజీవితో దాదాపు గంటపాటు చర్చించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవితో అల్లు అర్జున్ దిగిన ఫోటో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.