Erabelli:తెలంగాణలో వున్న ప్రతి ఒక్క NRI కుటుంబాన్ని కాపాడుకుంటానని పంచాయతీ రాజ్ . గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు .అమెరికా లోని ఫ్లోరిడాలో జరిగిన మంత్రి పుట్టినరోజు వేడుకల్లో అభిమణులను ఉద్దేశించి మాట్లాడారు ప్రభుత్వం తరుపున ఏ సహాయం కావాలన్న అందించే బాధ్యత నాదేనని అన్నారు నేను చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు 7 సార్లు గెలిపించారని గుర్తు చేశారు నన్ను గెలిపించిన ఉమ్మడి వరంగల్ జిల్లా, వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాల ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని అన్నారు .
సీఎం కెసిఆర్ గారి దయవల్ల మంత్రిని అయ్యాను ..పంచాయితీరాజ్ లాంటి పెద్ద శాఖను ఇచ్చారని ,పల్లె ప్రగతి ద్వారా పల్లెలన్నీ బాగా అభివృద్ది చెందాయని అన్నారు తెలంగాణ పల్లెలకు జాతీయ స్థాయిలో అత్యధిక అవార్డులు వచ్చాయని ,సీఎం కెసిఆర్ గారు బంగారు తెలంగాణ ను చేస్తున్నారని చెప్పారు తెలంగాణ ప్రభుత్వానికి మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని కోరారు . వేడుకల్లో నిర్మాత దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు