Homeహైదరాబాద్latest News54 ఏళ్ళ వయసులో పెళ్లికి రెడీ అవుతున్న ప్రముఖ హీరో.. ఈ వయసులో మూడో పెళ్లి...

54 ఏళ్ళ వయసులో పెళ్లికి రెడీ అవుతున్న ప్రముఖ హీరో.. ఈ వయసులో మూడో పెళ్లి ఏంటి అంటూ.. కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల్లో పెళ్లి తర్వాత రొమాన్స్, బ్రేకప్, విడాకులు సర్వసాధారణం. బాలీవుడ్‌లో ఇలాంటివి ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్, హీరోయిన్ కరీనాకపూర్ కలిసి 2012లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ దంపతులకు తైమూర్ మరియు జహంగీర్ అలీ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే సైఫ్ ఇప్పుడు మూడో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు బాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. త్వరలోనే ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారని సైఫ్ అలీ ఖాన్ తన చేతిపై పచ్చబొట్టు వేయించుకున్న కరీనాకపూర్ పేరును తొలగించి దాని ప్లేస్ లో త్రిశూలం ఆకారంలో కొత్త టాటూను వేయించుకున్నారని.. వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే సైఫ్ అలీఖాన్ వయసు 54 ఏళ్లు అన్న విషయం తెలిసిందే. ఈ వయసులో సైఫ్‌కి మూడో పెళ్లి అవసరమా అంటూ ..బాలీవుడ్ జనాలు అంటున్నారు. కరీనాను సైఫ్ అలీఖాన్ రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సైఫ్ తొలిసారిగా నటి అమృతా సింగ్‌ను 1991లో వివాహం చేసుకున్నారు. 13 ఏళ్ల అనుబంధం తర్వాత వారు 2004లో విడాకులు తీసుకున్నారు. వారికి అప్పటికే పిల్లలు ఉన్నారు. ఆ తరువాత సైఫ్ అలీఖాన్, హీరోయిన్ కరీనాకపూర్ ని 2012లో వివాహం చేసుకున్నాడు.ఈ క్రమంలో సైఫ్, కరీనా విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నిజం ఎంతో తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img