Fire Accident: హైదరాబాద్ నిజాంపేట్ ఫిట్‌సెస్ స్టూడియో సమీపంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టిఫిన్ సెంటర్‌లో గ్యాస్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో మూడు షాపులకు మంటలు వ్యాపించాయి. దీంతో షాపు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు మంటలను అదుపు చేస్తున్నారు.