ఇటీవల రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థిని జీవితం విషాదంగా ముగిసింది.
తనను నలుగురు ఆటో డ్రైవర్ల కిడ్నాప్ చేశారని, గ్యాంగ్ రేప్ చేశారనీ పోలీసులను పరుగులు పెట్టించిన యువతి.. చివరకు అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.
రాత్రి ఇంట్లో విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
తన తల్లితో విభేదాల కారణంగా.. యువతి కిడ్నాప్ కథ అల్లింది అని పోలీసులు తేల్చిన విషయం తెలిసిందే.