రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘కిసాన్ క్రెడిట్ కార్డు’ పథకం అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపు 7 శాతం వడ్డీతో రూ.3 లక్షల వరకు రైతులు లోన్ పొందవచ్చు. రైతులు ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. నిర్ణీత గడువులో చెల్లిస్తే 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. దీనిని ప్రధానమంత్రి ఫసల్ బీమాయోజనతో అనుసంధానించారు. ఈ పథకం ద్వారా లబ్దిపొందడానికి స్థానిక బ్యాంకులను సంప్రదించవచ్చు.
ALSO READ
New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. ఇవి తప్పనిసరి!