శబరిమల భక్తుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల నుంచి కొల్లం వరకు దక్షిణ మధ్య రైల్వే 36 ప్రత్యేక రైళ్లు నడపనుంది. సికింద్రాబాద్, కాకినాడ పోర్ట్, విజయవాడ, గుంటూరు, నర్సాపూర్ నుంచి ఈ రైళ్లు కొల్లంకు ఇరువైపులా రాకపోకలు సాగిస్తాయి. డిసెంబర్ 19 నుంచి జనవరి 24వ తేదీ వరకు వివిధ తేదీల్లో ఈ రైళ్లు ప్రయాణిస్తాయి.