రోహిత్ శర్మను అతని అభిమానులు ‘హిట్ మ్యాన్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. అతను 30 ఏప్రిల్ 1987న జన్మించాడు. నాగ్‌పూర్ (మహారాష్ట్ర)కి చెందిన రోహిత్ తన అమ్మమ్మ స్వస్థలమైన విశాఖపట్నంలో జన్మించాడు. తల్లి పూర్ణిమ శర్మ విశాఖకు చెందినవారు. తండ్రి గురునాథ్ శర్మ మహారాష్ట్రకు చెందినవారు. సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా మారిన రోహిత్ శర్మ నేటితో 37 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. క్లాస్‌తో పాటు పవర్ హిట్టింగ్ కూడా ఉన్న రోహిత్ తెలుగువాడనే విషయం చాలా మందికి తెలియదు. అయితే రోహిత్ శర్మ తండ్రి ఓ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో పనిచేసేవాడు. అర్ధాంతరంగా ఆయన ఉద్యోగం పోవడంతో కుటుంబ భారాన్ని రోహిత్ మోయాల్సి వచ్చింది. రోహిత్ ఇండియన్ ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు రంజీ ట్రోఫీ ఆడాడు. రోహిత్ శర్మ క్రికెట్ ఆడటం పూర్ణిమ తల్లికి అసలు ఇష్టం లేదు. అతడిని మంచి కంపెనీలో పర్మినెంట్ ఉద్యోగిగా చూడాలనుకుంది. కానీ రోహిత్ తన లక్ష్యంపై దృష్టి సారించి టీమ్ ఇండియాకు కెప్టెన్ అయ్యాడు.