Homeహైదరాబాద్latest NewsHigh Court : రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి.. రద్దు చేశామని చెప్పి మళ్ళీ...

High Court : రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి.. రద్దు చేశామని చెప్పి మళ్ళీ అనుమతి ఏంటి..?

High Court : రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలో ”గేమ్ ఛేంజర్” సినిమాకి టికెట్ రేట్లు పెంచడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ”గేమ్ ఛేంజర్”.ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ‘పుష్ప 2’ సినిమా రిలీజ్ సమయంలో జరిగిన సంధ్య థియేటర్ సంఘటనతో, సీఎం రేవంత్ రెడ్డి ఇకపై టికెట్ రేట్లు పెంచమని అన్నారు. అయితే ”గేమ్ ఛేంజర్” సినిమాకి టికెట్ రేట్లు పెంచేందుకు, బెనిఫిట్ షోలకు సీఎం రేవంత్ రెడ్డి అనుమతి ఇచ్చారు.
ఈ సినిమా టిక్కెట్ ధరలు, స్పెషల్ షోలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టు (High Court) తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలను రద్దు చేశామని చెప్పి పరోక్షంగా ప్రత్యేక షోలను అనుమతించడం ఏంటని కోర్టు ప్రశ్నించింది. ఉదయపు షోలకు అనుమతి ఇచ్చే అంశాన్ని పునఃపరిశీలించాలని హైకోర్టు హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. భారీ బడ్జెట్‌తో సినిమా తీసి ప్రేక్షకుల నుండి డబ్బు వసూలు చేయాల‌నుకోవ‌డం సరికాదని అన్నారు. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.game chenager 1024x576 1 ఇదేనిజం High Court : రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి.. రద్దు చేశామని చెప్పి మళ్ళీ అనుమతి ఏంటి..?

Recent

- Advertisment -spot_img