Homeహైదరాబాద్latest Newsరాశి ఫలాలు (09-01-2024, గురువారం)

రాశి ఫలాలు (09-01-2024, గురువారం)

నేటి రాశి ఫలాలు:

మేషరాశి
మేష రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆరోగ్యం అనుకూలించును. మీ ఆదాయ వనరులు అనూహ్యంగా పెరుగుతాయి. మీ సంకల్ప శక్తి పెరిగి మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది. స్త్రీలు కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు నియంత్రించుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగం చేసే ప్రాంతంలో పై అధికారులతో, సహ ఉద్యోగులతో ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారపరంగా ఇబ్బందులు, చికాకులు ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. కుటుంబ సమస్యలు, మానసిక ఆందోళనలు కలుగును. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. కుటుంబంతో ఆనందముగా గడుపుతారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. వ్యాపారంలో లాభాలుండును. స్నేహితులు, బంధువుల నుండి గౌరవం, గుర్తింపు పొందుతారు. ఆరోగ్యం అనుకూలించును. ప్రయాణాలు కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కలసివచ్చును. స్నేహితుల వలన లాభాలుండును. శుభవార్తలు వింటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రభుత్వం నుండి సహాయం అందుతుంది. మరింత శుభ ఫలితాలు పొందాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. వినాయకుడిని పూజించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. నూతన గృహ నిర్మాణం కొనుగోలు చేసే అవకాశం ఉంది. విలువైన వస్తువుల కొనుగోలుకు డబ్బును ఖర్చు చేసే అవకాశముంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉంది. ఉద్యోగులకు ఉద్యోగంలో పైఅధికారుల వలన ఇబ్బందులు ఏర్పడే అవకాశముంది. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీరు కొత్త విషయాలను అధ్యయనం చేస్తారు. విద్యార్థులు విద్యా విషయాల్లో రాణిస్తారు. పోటీ పరీక్షలలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మరింత శుభఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

తులా రాశి
తులా రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీ వాగ్దాటి వలన గౌరవం పొందుతారు. వృత్తిలో పురోగతి. ఆనందం, ఆరోగ్యం అనుకూలించును. సంపదలో పెరుగుదల ఉంటుంది. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ సహోద్యోగులు, స్నేహితుల నుండి ప్రశంసలు పొందుతారు. మీరు చాలా ముఖ్యమైన జ్ఞానాన్ని పొందుతారు. మీరు స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల సంస్థలో ఉంటారు. మరింత శుభఫలితాలు పొందాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. క్రమశిక్షణ ధైర్యంతో ప్రణాళికలను అమలుచేసి విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాన్ని జాగ్రత్తగా నడుపుతారు. సంస్థాగతమైన ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

మకర రాశి
మకర రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పైఅధికారులే నుంచి పని ఒత్తిళ్ళు ఎదురవుతాయి. గతంలోని సమస్యలు ఒక కొలిక్కివస్తాయి. నూతన గృహం కొనుగోలు చేస్తారు. సమస్త దోషాలు తొలగి వ్యాపారాలలో రాణిస్తారు. విద్యార్థులో చదువుల్లో పైకివస్తారు. సాయంకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయండి.

కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. కుటుంబంతో ఆనందముగా గడుపుతారు. ఖర్చులను నియంత్రించుకోవాలి. దైవబలం పెరుగుతుంది. పరిశోధనా రంగానికి సంబంధించి నూతన విషయాలను కనుగొంటారు. మీ అధికారం విస్తరిస్తుంది. కుంభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుతో నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. మీ అధికారం వల్ల వివిధ అధికారిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొంటారు. సంతానపరంగా విజయం లభిస్తుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. శుభవార్తలొస్తాయి. గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

Recent

- Advertisment -spot_img