Game Changer Review: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఎస్.జె సూర్య, సునీల్, శ్రీకాంత్, అంజలి తదితరులు కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మించారు. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? డైరెక్టర్ శంకర్ ఎంతవరకు సక్సెస్ అయ్యాడో తెలుసుకుందాం..
Game Changer Review
కథ
రామ్ నందన్ (రామ్ చరణ్) IAS చదివి వైజాగ్ కలెక్టర్ గా వస్తాడు. రాగానే అక్రమార్కుల భరతం పట్టడం మొదలుపెడతాడు. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు మోపిదేవి (ఎస్జె సూర్య) తో శత్రుత్వం ఏర్పడుతుంది. అనూహ్యంగా జరిగిన ఒక సంఘటన వల్ల సిఎం సత్యమూర్తి (శ్రీకాంత్) ద్వారా రామ్ అసలు తండ్రి అప్పన్న (రామ్ చరణ్) గతం బయపడుతుంది. తల్లి పార్వతి (అంజలి) బ్రతికే ఉందన్న నిజం తెలుస్తుంది. తర్వాత రామ్ ఊహించని రీతిలో కొన్ని పరిణామాలు ఎదురుకుని రాష్ట్రంలో ఒక కీలక మార్పుకు కారణమవుతాడు. అదేంటి, తండ్రి లక్ష్యం కోసం అతనేం చేశాడు, దుర్మార్గుల ఆట ఎలా కట్టించాడనేది తెరమీద చూడాలి.
విశ్లషణ
ఒక IAS ఆఫీసర్ తలుచుకుంటే ఏం చేయగలడు. రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చగలడు అనేది డైరెక్టర్ శంకర్ తనదైన శైలిలో చూపించాడు. అటు ఐఏఎస్ ఆఫీసర్ రామ్ గా ఇటు ఒక ఉద్యమ నాయకుడు అప్పన్న (రామ్ తండ్రి) రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. డబ్బు లేకుండా రాజకీయం చేయాలి అనే ఒక మంచి ఉద్దేశ్యంతో పార్టీ పెట్టిన అప్పన్నను సత్యమూర్తి ఎలా వెన్నుపోటు పొడిచాడు. సత్యమూర్తిని చంపి సీఎం అయిన కొడుకు మోపిదేవి (SJ సూర్య). మోపిదేవి వర్సెస్ రామ్ చివరికి ఎవరు గెలిచారు అనేది సినిమా.
ప్లస్ పాయింట్స్:
- రామ్ చరణ్
- అప్పన్న ఎపిసోడ్
- తమన్ మ్యూజిక్
- ఇంటర్వెల్ బ్లాక్
మైనస్ పాయింట్స్:
- లవ్ స్టోరీ
- కొత్తదనం లేని ట్రీట్మెంట్
- మాములు కథా కథనాలు
- అవసరం లేని సాంగ్స్
చివరిగా:
ఓవరాల్ గా గేమ్ ఛేంజర్.. ఇంట్రెస్టింగ్ పొలిటికల్ గేమ్..!
రేటింగ్:
3/5
ALSO READ
తెలంగాణలో ”గేమ్ ఛేంజర్” సినిమా టికెట్ రేట్లు పెంపు.. ఎంతంటే..?