జామలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని వైద్య నిపుణులు, డైట్, న్యూట్రీషన్ నిపుణులు చెబుతున్నారు. జామఆకుల్లో ఆయుర్వేద గుణాలున్నాయి. అందుకే ఈ జామాకు పొడిని ఎన్నోరకాలుగా వాడుతున్నారు. ఈ జామ పౌడర్ కలిపిన టీలు, కషాయాలు ట్రెండ్‌గా మారాయి. ఈ పొడివల్ల అనేక ఆరోగ్యపరమైన బెనిఫిట్స్ ఉండడంతో జామాకులకు డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది. టన్ను జామ ఆకు ధర రూ. 37 వేలు పలుకుతోంది.