Homeహైదరాబాద్latest NewsHyderabad : పహల్గాం దాడి.. హైదరాబాద్ లో హై అలర్ట్

Hyderabad : పహల్గాం దాడి.. హైదరాబాద్ లో హై అలర్ట్

Hyderabad : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం లో ఏప్రిల్ 22, 2025న జరిగిన ఉగ్రదాడి తర్వాత హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారంతో రాష్ట్ర పోలీసు శాఖ పూర్తి అప్రమత్తంగా ఉంది. ఈ ఘటన తర్వాత, కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికలతో ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం కేంద్రంగా ఉన్న HICC మరియు సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో కఠినమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. గతంలో హైదరాబాద్ ఉగ్రవాద దాడులకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉండాలని నిఘా సంస్థలు రాష్ట్ర పోలీసులను హెచ్చరించాయి.

Recent

- Advertisment -spot_img