Homeహైదరాబాద్latest Newsనేను లైంగిక వేధింపులకు గురయ్యాను.. యాంకర్ సౌమ్య షాకింగ్ స్టేట్‌మెంట్..!

నేను లైంగిక వేధింపులకు గురయ్యాను.. యాంకర్ సౌమ్య షాకింగ్ స్టేట్‌మెంట్..!

జబర్దస్త్ చాలా పాపులర్ కామెడీ షో ద్వారా చాలా మంది సామాన్యులు స్టార్స్ అయ్యారు. అనసూయ, రష్మీ గౌతమ్ ఫేట్ మార్చిన షో ఇదే. కొన్నాళ్ల పాటు వీరిద్దరూ జబర్దస్త్ షోలో తమ గ్లామర్‌తో అలరించారు. యాంకర్ సౌమ్యరావు జబర్దస్త్ షోను ఏడాదికి పైగా చేసింది. అయితే అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో సౌమ్యరావు కూడా జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నారు.
తాజాగా సౌమ్యరావు ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ప్రతి ఇండస్ట్రీలోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది.. ఆ సమస్యను ఎదుర్కొన్నాను అని సౌమ్యరావు అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కన్నడ పరిశ్రమ పట్ల సౌమ్యరావు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు, నాకు కన్నడ పరిశ్రమ అంటే ఇష్టం లేదు. వారు ప్రతిభావంతులను ఎంకరేజ్ చేయరు. అందుకే కన్నడ పరిశ్రమ వెనుకబడిపోయింది అని సౌమ్యరావు షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. టాలీవుడ్‌లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది. కానీ నేను ఇక్కడ అలాంటి సమస్యను ఎదుర్కోలేదు. కానీ కన్నడలో కొందరు లైంగిక వేధింపులకు గురయ్యారు. నటీనటులే కాదు.. దర్శకులు, నిర్మాతలు కూడా కమిట్‌మెంట్ అడుగుతారని సౌమ్యరావు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నప్పటికీ నాకు ఎలాంటి అనుభవం లేదన్నారు.

Recent

- Advertisment -spot_img