బీచ్ లకు వెళ్లి ఎంజాయ్ చేయాలని చాలా మందికి ఉంటుంది..చక్కటి సముద్రపు అలలను చూస్తూ ఉండిపోవాలని..బీచ్ లో చల్లని బీరు తాగుతూ సముద్రపు అందాలను ఆస్వాదించాలని..మరి కొంతమందికి కొంచం రొమాంటిక్ గా ఎంజాయ్ చేయాలనీ అనిపిస్తుంటుంది. అందుకే చాలామంది కాస్త సమయం దొరికితే దగ్గర్లో బీచ్ కు వెళ్లడం..లేదంటే కాస్త దూరంగా ఉన్న బీచ్ లకు వెళ్తుంటారు. అయితే కొన్ని బీచ్ లకు వెళ్తే మాత్రం నగ్నంగా తిరగాల్సిందే. ఆ బీచ్ లో ఎవర్ని చూసిన నగ్నంగా ఒంటిమీద నూలు పోగులేకుండా దర్శనం ఇస్తుంటారు.
మరి ఆ బీచ్ ల పేరు..అవి ఎక్కడ ఉన్నాయో చూద్దామా..!
వాలాల్తా బీచ్: క్రొయేషియాలోని ఉన్న వాలాల్టా బీచ్ వెల్వెట్ ఇసుకకు ఎంతో ప్రసిద్ధి. యూరప్ నుంచే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన పర్యాటకులు ఇక్కడికి వచ్చి.. బట్టలు లేకుండా సముద్రపు నీటిలో ఎంజాయ్ చేతుంటారు.
బెలెవ్యూ బీచ్: ఈ బీచ్ డెన్మార్క్ లోని ఉంది. వరల్డ్ లోనే ఈ బీచ్ చాల ఫేమస్. ఇక్కడ ఎటు చూసిన అంత బట్టలు లేకుండా కనిపిస్తుంటారు. ఎవరైనా బట్టలు వేసుకొని బీచ్ కనిపిస్తే కొత్తగా..వింతగా చూస్తారు. అలాగే ఇక్కడ పర్యాటకుల భద్రత కోసం పటిష్టమైన భద్రతా ఉంటుంది. ఏ వ్యక్తి వల్ల ఇతరుల శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంత సెక్యూరిటీ ఉంటుంది.
కార్నిగ్లియా బీచ్: ఈ బీచ్ఇటలీ లో ఉంది. ఇక్కడ చాల బీచ్ లు ఉన్నప్పటికీ కార్నిగ్లియా బీచ్ చాల ప్రత్యేకం. ఎందుకంటే ఇటలీలోని పురాతన, ప్రసిద్ధ న్యూడ్ బీచ్ ఇది. ఈ బీచ్ చేరుకోవడానికి సొరంగ మార్గం ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా మంది మహిళలు టాప్‌లెస్‌గా సన్‌బాత్ చేస్తూ కనిపిస్తారు. ఎలాంటి పరిమితులు ఉండవు.
కేప్ డి అగ్డే బీచ్: ఫ్రాన్స్‌లో ఈ బీచ్ ఉంది. ఈ బీచ్‌కి వెళ్లాలంటే బట్టలు లేకుండా వెళ్లాల్సిందే. బట్టలుంటే అనుమతించారు. నగ్నంగా వెళ్లి.. అక్కడ స్నానం చేయాలి. ఒకవేళ స్నానం చేసేటప్పుడు మీ శరీరంపై బట్టలు ఉంటే బీచ్ గార్డులు మిమ్మల్ని అడ్డుకోవచ్చు. అందువల్ల తప్పనిసరిగా బట్టలు విప్పాల్సి ఉంటుంది.
లూకాట్ బీచ్: ఫ్రాన్స్‌లోని లుకాట్ బీచ్ ఒకటి. మధ్యధరా సముద్రానికి ఆనుకుని ఉన్న ఈ బీచ్‌లో నగ్నంగా సంచరించేందుకు ఎలాంటి పరిమితి ఉండదు. ఎవరైనా వెళ్లి నగ్నంగా తిరగొచ్చు.