Homeహైదరాబాద్latest Newsకొమురంభీం ఆసిఫాబాద్: SheTeam పనితీరు మెరుగు

కొమురంభీం ఆసిఫాబాద్: SheTeam పనితీరు మెరుగు

  • పాఠశాలల్లో, కళాశాలల్లో నిత్యం మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి
  • ఆకతాయిలకు, పోకిరీలకు అడ్డుకట్ట వేయాలి

– ఎస్పీ కే సురేష్ కుమార్

ఇదే నిజం, కొమురంభీం ఆసిఫాబాద్ ప్రతినిధి: మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీం పనితీరు మెరుగు పడుతుందని, మరింత రక్షణగా షీటీమ్ పని చేయాలని జిల్లా ఎస్పీ కే సురేశ్ కుమార్ తెలిపారు. జిల్లా షీటీమ్ ను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా షీటీమ్ వారి తో ఎస్పీ పత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి: ఆడవారికి బిగ్ షాక్.. ఇక ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కష్టమేనా..

మహిళలపై దాడులు, వేధింపులు, ఆడపిల్లల పట్ల ఆకతాయిల చేష్టలకు చెక్ పెట్టేందుకు షీటీమ్స్ పనితీరు మెరుగుపడుతుందనీ తెలిపారు. విద్యార్థినులను వేధించేవారిని, మహిళల పట్ల ఆసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీల పట్ల చర్యలు తీసుకోవాలని, ఈవ్ టీజర్ల తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వడం, మళ్లీ పట్టుబడితే తీవ్రమైన కేసును నమోదు చేయడం షీటీమ్స్ ముఖ్య బాధ్యతని గుర్తు చేశారు. జిల్లాలో మరిన్ని షీటీమ్ అవగాహన కార్యక్రమాలు చేపట్టి , కేసులు తక్కువ ముఖం పట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఇది కూడా చదవండి: జస్ట్ రూ.400తో అయోధ్యకు వెళ్లొచ్చు.. ఇలా..

షీటీమ్స్ కొన్ని కొన్ని కేసుల్లో పేరెంట్స్ కి కౌన్సెలింగ్ ఇవ్వాలని అన్నారు. ఆకతాయిలు, పోకిరీలను షి టీమ్స్ వ్యవస్థ కేసులు నమోదు చేసి, కౌన్సిలింగ్ నిర్వహించాలని అన్నారు.ఎక్కువగా సైబర్ క్రైమ్ ఫ్రాడ్ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా గురించి మరింత అవగాహన యువతకు, విద్యార్థులకు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ మరియు స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ రాణాప్రతాప్, కాగజ్ నగర్ డివిజన్ షీటీమ్ ఇంచార్జ్ శ్రీనివాస్ (ఎఆర్ఎస్ఐ), ఆసిఫాబాద్ డివిజన్ షీటీమ్ ఇంచార్జి సునీత (హెడ్ కానిస్టేబుల్) , షీ టీం సభ్యులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఘోర బస్సు ప్రమాదం..

Recent

- Advertisment -spot_img