లగాచర్లలో కలెక్టర్‌పై దాడిపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేసారు.కలెక్టర్‌పై దాడి కేటీఆర్ చేశారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. అమాయక ప్రజలను కేటీఆర్ బలి చేస్తున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన అధికారులను విదేశాల్లో దాచిపెట్టారని కొండా సురేఖ విమర్శించారు. గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ దుష్టపాలన ముగిసి ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని కొండా సురేఖ తెలిపారు.