Homeహైదరాబాద్#KTR : చిన్నారి వైద్యానికి ఎల్వోసీ అందించిన కేటీఆర్

#KTR : చిన్నారి వైద్యానికి ఎల్వోసీ అందించిన కేటీఆర్

మూగ, చెవిటి లోపంతో జన్మించిన చిన్నారి వైద్యానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అండగా నిలిచారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాగారం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మొగుళ్ల శ్రీనివాస్‌ మనుమరాలు, పెండ్యాల భావన, సందీప్‌ దంపతుల కుమార్తె నిహార్వి(3) వినికిడి లోపంతో జన్మించింది.

హైదరాబాద్‌లో కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీ చేయాల్సి ఉండగా, అందుకోసం రూ.18.50 లక్షల ఖర్చు ఆవుతుందని వైద్యులు తెలిపారు.

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆ చిన్నారి సమస్యను మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన కేటీఆర్‌ రూ.18.50 లక్షల ఎల్వోసీని గురువారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో బాధిత కుటుంబానికి అందజేశారు.

చిన్నారి వైద్యం కోసం పెద్ద మనసుతో స్పందించి ఆర్థిక సాయం అందించిన మంత్రి కేటీఆర్‌కు,

సహకరించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ నాయకుడు మొగుళ్ల శ్రీనివాస్‌ కృతజ్ఞతలు తెలిపారు.

IT Minister KTR supports the medical treatment of a child born with a dumb, deaf.

TRS leader, former ZPTC member Mogulla Srinivas granddaughter, Pendyala Bhavana, daughter of Sandeep couple, Niharvi (3) of Valigonda Mandal Nagaram village, Yadadadri Bhuvanagiri district, was born with hearing defect.

Doctors said it would cost Rs. 18.50 lakhs while cocklear implant surgery was to be performed in Hyderabad.

Bhuvanagiri MLA Paila Sekhar Reddy has taken that child’s problem to the attention of Minister KTR. Immediately responded KTR handed over Rs. 18.50 lakh LVOC to the victim family at Pragatibhavan, Hyderabad on Thursday.

TRS leader Mogulla Srinivas thanked Minister KTR and MLA Paila Sekhar Reddy who supported by responding with a big heart for the treatment of the child.

Recent

- Advertisment -spot_img