Homeఆంధ్రప్రదేశ్పేదలకు జగన్ గుడ్‌న్యూస్..

పేదలకు జగన్ గుడ్‌న్యూస్..

అమరావతి, ఇదేనిజం : ఏపీలో పేదలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డిసెంబర్ 1 నుంచి బియ్యాన్ని ప్రజలకు డోర్ డెలివరీ చేయనుంది. రేషన్​ కార్డు ఉన్న పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను 9,260 ప్రత్యేక వాహనాలతో బియ్యాన్ని ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తారు. ఈ బియ్యం సరఫరాకు గాను ప్రభుత్వం రీయూజబుల్‌ సంచులను పంపిణీ చేయనుంది. క్వాలిటీ బియ్యం డోర్ డెలివరీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

డెలివరీ వాహనాల ద్వారా స్వయం ఉపాధి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, ఈబీసీ యువతకు అవకాశం ఇవ్వనున్నారు. వాహనాలు కొనుగోలుకు 60 శాతం సబ్సిడీ, 30 శాతం లోన్ ప్రభుత్వం అందించనుంది. కేవలం పది శాతం చెల్లించి వారు వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. ఎవరైనా లబ్ధిదారు బియ్యం వద్దు అనుకుంటే వారికి నగదు ఇవ్వాలని భావిస్తోంది ప్రభుత్వం. ఈ విదానంలో కిలో బియ్యానికి బదులు రూ.30 వరకు ఇవ్వనున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img