కలియుగ పాంచాలి.. ఐదుగురు అన్నాదమ్ములకు ఒకటే భార్య… మహాభారతం గురించి తెలిసిన వాళ్లకు ఐదుగురు అన్నాదమ్ములను పెళ్లి చేసుకున్న ద్రౌపది కథ తెలిసే ఉంటుంది.
ఐదుగురిని వివాహం చేసుకోవడం వల్లే ఆమెను పాంచాలి అని పిలుస్తాం. అయితే కలియుగంలో కూడా అన్నదమ్ములను పెండ్లి చేసుకున్న పాంచాలి ఉంది.
మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ వింత సాంప్రదాయం అమలులో ఉంది.
హిమాచల్ ప్రదేశ్ నేటికీ ఐదుగురు అన్నాదమ్ములు ఒకే మహిళను వివాహం చేసుకుని సంసారం చేస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్ లోని కొన్ని తెగలు ఒకే కుటుంబంలో ఎంతమంది అన్నాదమ్ములు ఉన్నా ఒకే మహిళను పెళ్లి చేసుకునే వింత ఆచారాన్ని కొనసాగిస్తున్నాయి.
ఉమ్మడి వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కొన్ని కుటుంబాలు ఈ వింత ఆచారాన్ని అనుసరిస్తున్నాయి.
అన్నాదమ్ములు వేర్వేరు అమ్మాయిలను చేసుకుంటే వేర్వేరు కాపురాలను పెట్టుకుంటారని.. అలా చేయడం వల్ల కుటుంబాలు విడిపోయే అవకాశం ఉందట.
అందుకే కొన్ని తెగలు ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి.
ఈ సంప్రదాయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ మహిళను కలియుగ పాంచాలి అని అన్నాదమ్ములను కలియుగ పాండవులు అని నెటిజన్లు పిలుస్తున్నారు.