KTR : ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా పై ఉక్కు పాదం అని బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ లేదు.. కొత్త ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగభృతి రాదు అని అన్నారు. అధికారం కోసం అశోక్ నగర్ గడపతొక్కారు అని వ్యాఖ్యానించారు. అధికారం దక్కిన తర్వాత నిరుద్యోగుల గొంతునొక్కారు. న్యాయం కోసం నిలదీసిన దళితరైతు వెంకటయ్యను అరెస్టు చేసారు. దళితరైతు అభిప్రాయం తీసుకున్న జర్నలిస్టులు రేవతి, తన్వియాదవ్ లకు జైలు పంపారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ ఇంటి మీద దాడికి యత్నం చేసారు. ప్రశ్నిస్తే కేసులు నిలదీస్తే దాడులు, జైలు.. రాజ్యాంగం పట్టుకుని దేశంలో తిరిగే రాహుల్ గాంధీకి తెలంగాణలో జరుగుతున్న అరాచక కాంగ్రెస్ పాలన కనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్, బీజేపీ ఆగర్భ శత్రువులు కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీజేపీలు మంచి మిత్రులు అని కేటీఆర్ అన్నారు.