IPL : SRH vs MI మ్యాచ్‌పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. సన్‌రైజర్స్ ఆడిన తీరును అయన X వేదిక ద్వారా మెచ్చుకున్నారు. పవర్ హిట్టింగ్ తో అభిమానులను అలరించింనందుకు ధన్యవాదాలు తెలిపారు. ఐపీఎల్ చరిత్రలోనే Sunrisers Hyderabad అత్యధిక స్కోరు చేయడం గొప్ప విషయమన్నారు. టేక్ అ బో అబ్బాయిలు అంటూ ప్లేయర్లను అభినందించారు. నిన్న రాత్రి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే.