HomeజాతీయంKTR: What did Modi do to Palamuru in ten years? కేటీఆర్: పదేళ్లలో...

KTR: What did Modi do to Palamuru in ten years? కేటీఆర్: పదేళ్లలో పాలమూరుకు మోదీ ఏం చేశారు?

– తెలంగాణలో బీజేపీకి వచ్చేవి సున్నా సీట్లే
– మంత్రి కేటీఆర్ ట్వీట్

ఇదే నిజం, హైదరాబాద్: పాలమూరు గడ్డపై పదేండ్ల కిందట ఎన్నికల ఆర్బాటంగా మోడీ ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చకపోవడంపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా నిలదీశారు. 2014లో ఏర్పాటు చేసిన సభలో పాలమూరు ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై అప్పటి యూఏపీ ప్రభుత్వం వివక్షను నిలదీసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పదేండ్ల పాలనలో పాలమూరును పట్టించుకోకుండా నిద్రపోయారా అని యూపీఏ ప్రభుత్వాన్ని మోడీ నిలదీశారని.. మహబూబ్‌నగర్‌పై బీజేపీ ఉదాసీనత చూపించి ఇప్పుడు మరో పదేండ్లు గడిచిపోయాయని అన్నారు. ఈ పదేండ్లలో పాలమూరు అభివృద్ధికి మీరేం చేశారో చూపించాలని అనుకుంటున్నానని మోడీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. గడిచిన పదేండ్లలో పాలమూరు ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు ఏ సాయం చేశారని నిలదీశారు. ఈ పదేండ్లలో మీరు అందించిన సాయం సున్నా అని చురకలంటించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మీ బీజేపీ పార్టీ కూడా అవే నంబర్ సీట్లు గెలుచుకుంటుందని కేటీఆర్ ట్విట్టర్​ ద్వారా విమర్శలు చేశారు.

Recent

- Advertisment -spot_img