Homeఫ్లాష్ ఫ్లాష్Loan app: రుణ యాప్ కు యువకుడు బలి

Loan app: రుణ యాప్ కు యువకుడు బలి

Loan app:వనపర్తి జిల్లాలో రుణ యాప్ కు ఓ యువకుడు బలి అయ్యింది. ఒత్తిళ్లకు లోనై కొత్తకోట పట్టణానికి చెందిన దాసరి శేఖర్ (32) అనే సంవత్సరాల అనే యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గత నెల రోజుల క్రితం ఈ యువకునికి ఆన్లైన్ ద్వారా రుణం కావాలా అని ఒక యాప్ నుంచి లింక్ వచ్చింది . దీంతో ఆ యువకుడు ఆన్లైన్లో 2000 రూపాయల రుణాన్ని పొందాడు. దీంతో వారం రోజులు ఆ తిరిగి రుణ 2000 రూపాయల రుణాన్ని చెల్లించాడు. మరుసటి రోజు మళ్లీ 2500 రుణాన్ని అతని ఖాతాలో జమ చేశారు. తనకు రుణము వద్దు అని జమ చేసిన 2500 రూపాయల డబ్బులను వారి ఖాతాలోకి తిరిగి పంపాడు. అప్పటికే అతన్ని ఒత్తిడికి గురి చేసి రుణం తీసుకునే విధంగా చేశారు. ఆ యువకునికి లింకు ద్వారా తీసుకున్న రుణంతోపాటు అతని ఫోన్లో ఉన్న తోటి స్నేహితుల నెంబర్ల ను యాప్ నిర్వాహకులు తీసుకుని వారి స్నేహితులకు ఇతను మోసగాడు అని మెసేజ్ పెట్టారు. ఆ యువకుడు భయపడి చేసేదేమీ లేక తీసుకున్న రుణాన్ని మొదటగా 2000 తర్వాత 4000 రూపాయలతో పాటు అలా చెల్లిస్తూ 30 వేల రూపాయలు చెల్లిస్తూ పోయాడు. మరో 40000 కట్టాలని ఒత్తిడి తెచ్చారు. ససేమిరా అనడంతో యాప్ నిర్వాహకులు కోపానికి గురయ్యారు శేఖర్ ఫొటోకు మరో యువకుని ఫోటో జతపరుస్తూ స్వలింగ సంపర్కం చేస్తున్నాడని ఫోటోలు పోస్ట్ చేశారు. దీంతో శేఖర్ ఆందోళనకు, అవమానానికి గురై ఆత్మహత్య చేసు కున్నాడు. శేఖర్ భార్య అమరావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కొత్తకోట ఎస్సై నాగ శేఖర్ రెడ్డి తెలిపారు

Recent

- Advertisment -spot_img