Homeహైదరాబాద్latest Newsఅధికారం కోసం అబద్దాల హమీలిస్తుండ్లు: పుట్ట మధూకర్‌

అధికారం కోసం అబద్దాల హమీలిస్తుండ్లు: పుట్ట మధూకర్‌

ఇదే నిజం, రామగిరి: కాంగ్రెస్‌ను ఒక్కసారి నమ్మి మోసపోయినం పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై ఆలోచన చేయాలే జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అధికారం కోసం ఎన్ని అబద్దాల హమీలైన ప్రకటించేందుకు కాంగ్రెస్సోళ్లు సిద్దంగా ఉంటారని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో బాగంగా బీఆర్‌ఎస్‌ పెద్దపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ ప్రదేశాల్లో ఆయన పర్యటించి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్సోళ్లకు పథకాలు గుర్తుకు వస్తాయని,ఎన్నికల తర్వాత పథకాల అమలుకు వాయిదాలు వేయడం అలవాటుగా మారిందన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు నేటి పార్లమెంట్‌ ఎన్నికల వరకు ఆరు గ్యారెంటీ పథకాల పేరుతో ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్‌ కుట్రలు చేస్తోందని,నాడు పథకాల పేరుతో అగం చేసినోళ్లే మళ్లా ఆగం చేసేందుకు వస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాలు అమలు చేస్తామని డిసెంబర్‌ 3న ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే డిసెంబర్‌ 9న రుణమాఫీ చేస్తామని హమీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ రుణమాఫీని పార్లమెంట్‌ ఎన్నికల్లో వాడుకుంటూ ఆగస్టు 15కి వాయిదా వేశాడని ఆయన ఎద్దేవా చేశారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్కటి పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు.

గత ప్రభుత్వం అందించిన పథకాలనే కొనసాగిస్తున్నారని అన్నారు.పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని కోరుకుందని,ఏనాడు ప్రజలకు పథకాల ఆశ చూపలేదని,ప్రజల అవసరాలను గుర్తించి పథకాలకు రూపకల్పన చేసిన చరిత్ర గత ప్రభుత్వం,మాజీ సీఎం కేసీఆర్‌దేనని ఆయన అన్నారు.ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీని నమ్మి ప్రజలు మోసపోయారని, నీళ్లు,కరెంటు లేక ఆగమయ్యారని ఆయన గుర్తు చేశారు.పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మోసపూరిత మాటలు,అమలుకు సాధ్యం కాని పథకాలను నమ్మి ఓటు వేస్తే ఆగమైపోక తప్పదన్నారు.పేద ప్రజల సంక్షేమం కోసం పరితపించే పెద్దపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను ఆశీర్వదించాలని,గతంలో మంత్రిగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు చేశారని, పేద వర్గాలకు అండగా నిలచే నాయకుడు కొప్పుల ఈశ్వర్‌ అని ఆయన అన్నారు. ప్రజలు గొప్పగా ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోవాలని, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను బారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Recent

- Advertisment -spot_img