Homeహైదరాబాద్latest Newsమీనాక్షీ.. అంతొద్దమ్మా..!

మీనాక్షీ.. అంతొద్దమ్మా..!

అందరూ కాకపోయినా.. కొందరికి మాత్రం.. టాలీవుడ్‌లో సినిమా ఛాన్సులు రావాలంటే.. గ్లామర్ షో చేయాలి. వెయిట్ లేకపోయినా.. స్టార్ హీరో సినిమాను ఒప్పుకోవాలి. అవసరం లేకపోయినా కమర్షియాలిటీ కోసం లిప్ లాక్ సీన్స్‌లో యాక్ట్ చేయాలి. నడుము చూపడాలు.. అప్పుడప్పుడూ అయినా.. కాస్త వెకిలీ నాట్యమాడడాలు చేయాలి. ఎప్పుడూ కాకపోయినా.. కెరీర్లో ఒకటి రెండు సినిమాల్లో అయినా.. ఇలా కనిపించాలి. ఇలాంటివాటికి నో చెప్పారంటే.. మాత్రం.. ఫేడ్ అవుట్ హీరోయిన్ల లిస్టులోకి ఎక్కేయాలి. ఇలాంటి వాటికే ఇప్పుడు నో అంటున్న మరో ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. గుంటూరు కారంతో హిట్టు కొట్టి.. ప్రజెంట్ టాలీవుడ్లో ఫుల్‌ బిజీగా ఉన్నారు మీనాక్షి చౌదరి. ఆల్రెడీ రవితేజ లాంటి సీనియర్ స్టార్స్‌తో స్క్రీన్‌ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ, మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది. ఇంకా కెరీర్‌లో స్టార్టింగ్‌లో స్టేజ్‌లోనే ఉన్నా… మూవీ సెలక్షన్స్ విషయంలో స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతుంది ఈ బ్యూటీ. ముఖ్యంగా బోల్డ్ సీన్స్ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. కథ డిమాండ్ చేస్తే ముద్దు సీన్‌ వరకు ఓకేగానీ.. అంతకు మించి బోల్డ్ సీన్స్‌ చేయనని క్లారిటీ ఇచ్చేశారు మీనాక్షి చౌదరి. ఇప్పటికే అలా బోల్డ్ సీన్స్‌కు నో చెప్పటం వల్ల చాలా అవకాశాలు కోల్పోయానన్నారు. అయినా ఈ విషయంలో మనసు మార్చుకునే ఉద్దేశం మాత్రం లేదన్నారు. ఈమైతే అంటున్నారు కానీ.. ఈ మాటలు విన్న నెటిజన్స్ మాత్రం కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కథలొద్దమ్మా అని.. నువు ఉంది.. టాలీవుడ్‌లో అని గుర్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు తాను చేసిన ఎక్స్‌పోజింగ్ అండ్ లిప్ లాక్ సీన్లను వెతికి మరీ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇవి జర చూసుకో అంటూ.. మీమ్స్‌గా కూడా వదులుతున్నారు.

Recent

- Advertisment -spot_img