Mega DSC : ఏపీ మెగా డీఎస్సీ (Mega DSC) అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏప్రిల్ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రానుంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ అమలుకు గురువారం ఆర్డినెన్స్ జారీ చేయడంతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ వారంలోనే ఏపీ మెగా డిఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల కానుంది. మళ్లీ పాఠశాలలు తిరిగి మొదలయ్యేలోగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నారు.