Minister sabitha:విద్యార్థుల వరుస ఆత్మహత్యల ఘటనలతో విద్యాశాఖ కదిలింది. ఇంటర్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అవుతున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు M.C.R.H.R.Dలో జూనియర్ కాలేజీల యాజమాన్యాలతో సమావేశం కానున్నారు. ఈ భేటీకి హాజరుకావాలని 14 ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలకు సమాచారం ఇచ్చినట్టు ఇంటర్ బోర్డు తెలిపింది.
విద్యార్థుల ఆత్మహత్యలు కళాశాలల యాజమాన్యాల ఒత్తిడి వల్లే జరుగుతున్నాయనే విషయం తెలిసినప్పటికీ కార్పొరేట్ కాలేజీల మీద చర్యలు ఉంటాయా అనేది డౌటే . ప్రభుత్వానికి భయపడే స్థాయిలో కళాశాలలు లేవనేది అక్షర సత్యం. ఉంటె ఇన్ని అనుమతి లేని కళాశాలలు నడిచేవి కావు . ఒక బ్రాంచిలో అడ్మిషన్ తీసుకుని మరో బ్రాంచిలో ఏ మాత్రం సౌకర్యాలు లేని కళాశాలల్లో ,
హాస్టల్స్ లో తరగతులు నిర్వహించేవారు కాదు .అయినా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో జరిగే సమావేశంలో యాజమాన్యాలు తమ తప్పులు అంగీకరిస్తాయని ఎవ్వరికైనా నమ్మకం ఉంటె పప్పులో కాలేసినట్లే .