Homeహైదరాబాద్latest Newsముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు

ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు

ఇదే నిజం, బెల్లంపల్లి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తమ నియోజకవర్గ అభివృద్ధి కొరకు పలు కార్యక్రమాలకు నిధులు కేటాయించి, నియోజకవర్గాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు పూర్తి సహకారం అందించాలని సీఎంకు విన్నవించినట్లు తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి అన్ని నియోజకవర్గాలకు పునర్నిర్మాణ విషయంలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారని వారు చెప్పారు.

Recent

- Advertisment -spot_img