Homeహైదరాబాద్latest Newsరైతులపై జరిగిన దాడికి మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాలి

రైతులపై జరిగిన దాడికి మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాలి

ఇదే నిజం, సూర్యాపేట : కనీస మద్దతు ధర చట్టం కోసం దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్నఆందోళనను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం తగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో జరిగిన సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోడీ ప్రభుత్వం కార్మిక, కర్షకుల పొట్ట కొట్టే విధానాలకు పాల్పడుతుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజలను విభజించి పాలిస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నకార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రైతులపై జరుగుతున్న దాడులకు మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాలని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మోడీ అనుసరిస్తున్న విధానాల కారణంగా దేశంలో తీవ్రమైన ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కోట గోపి, చెరుకు ఏక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img