Nara Lokesh: ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని ఆ పార్టీకి చెందిన వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌పై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. అత్యుత్సాహం వద్దని నేతలను హెచ్చరించింది. కూటమి నేతలు మాట్లాడుకున్నాకే ఏదైనా నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేసింది.