Homeహైదరాబాద్latest Newsమరోసారి వర్ష గండం.. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు..!

మరోసారి వర్ష గండం.. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు..!

తెలంగాణలో రెండ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, హైదరాబాద్‌తో పాటు మేడ్చల్‌, మల్కాజిగిరి, వికారాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరం వద్ద నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్రమట్టానికి 1.5 కి.మీ నుంచి 3.1 కి.మీ మధ్య కేంద్రీకృతమైన చక్రవాతపు ఆవర్తనం ఈ రోజు కూడా అదే ప్రాంతంలో కొనసాగుతున్నట్టు వెల్లడించింది. దీంతో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురువనున్నాయి.

Recent

- Advertisment -spot_img